ఇదేందయ్యా, ఇది.. 40 పైసల కోసం కోర్టుకెక్కాడు.. చివరికి భారీ షాక్ తిన్నాడు!

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి 40 పైసల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.రెస్టారెంట్ తనకు అదనంగా 40 పైసలు ఛార్జ్ చేసిందని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

 Went To Court For 40 Paise Finally Ate A Huge Shock , 40 Paisa , Court , Bang-TeluguStop.com

అయితే ఈ కేసును టేకప్ చేసిన కోర్టు అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళితే… మూర్తి అనే ఒక సీనియర్ సిటిజన్ గతేడాది మే నెలలో ముంబైలోని సెంట్రల్ స్ట్రీట్ లోని హోటల్ ఎంపైర్ కి వెళ్ళాడు.అక్కడ అతను రూ.264.60 విలువైన ఫుడ్ కొనుగోలు చేశాడు.

అయితే రెస్టారెంట్ యాజమాన్యం అతడికి రూ.265 బిల్లు అందించింది.అంటే 40 పైసలు ఎక్కువగా బిల్లు వేసింది.దీంతో అతడు బాగా ఆగ్రహించాడు.40 పైసలు ఎక్కువ ఎందుకు ఛార్జ్ చేశారు అంటూ వాగ్వాదానికి దిగాడు.అయితే రూ.264.60లో 60 పైసలు తీసుకోలేము కాబట్టి రౌండ్ ఫిగర్ గా రూ.265 బిల్లు వేశామని రెస్టారెంట్ యాజమాన్యం బదిలిచ్చింది.దీంతో నిరాశకు గురైన సదరు కస్టమర్ రెస్టారెంట్ యాజమాన్యం తనకు నష్టపరిహారంగా రూపాయి ఇవ్వాలంటూ మూర్తి కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు.ఎందుకంటే రెస్టారెంట్ తీరు తనకి మెంటల్ షాక్ ఇచ్చిందని అతడు పేర్కొన్నాడు.

Telugu Paisa, Banglore, Central Street, Mumbai, Murthy, Restaurant-Latest News -

అయితే ఈ కేసును టేకప్ చేసిన కోర్టు లాజికల్ గానే తీర్పు వెలువరించింది.ఇండియా సర్క్యులర్స్ గవర్నమెంట్ ప్రకారం, 50 పైసల కంటే ఎక్కువగా డబ్బులను ఒక రూపాయిగా రౌండ్ ఫిగర్ చేయొచ్చు.ఒకవేళ 50 పైసల కంటే తక్కువగా ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేయక్కర్లేదు.ఇదే విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.“మూర్తి కేసులో 60 పైసలను రెస్టారెంట్ యాజమాన్యం రౌండ్ ఫిగర్ చేసి దాన్ని రూపాయిగా లెక్కగట్టింది.ఇందులో రెస్టారెంట్ తప్పేం లేదు.

కానీ కేవలం 40 పైసల కోసం కోర్టు, రెస్టారెంట్ యాజమాన్యం సిబ్బంది విలువైన సమయాన్ని వృథా చేయడం సరైంది కాదు.మూర్తి తీరు చూస్తుంటే అతను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడని తెలుస్తోంది” అని కోర్టు చెప్పుకొచ్చింది.

అందుకే అతడు 2 వేల రూపాయలు నష్టపరిహారంగా రెస్టారెంట్ మ్యానేజ్మెంట్ డైరెక్టర్ కు ఇవ్వాలని, మరో 2 వేల రూపాయలు కోర్టుకు ఇవ్వాలని కోర్టు మూర్తికి ఆదేశించింది.దీంతో భారీ షాక్ తిన్న సదరు కస్టమర్ మరో మాట మాట్లాడకుండా వెనుతిరిగాడు.

అయితే దీని గురించి తెలుసుకున్న చాలామంది తెలివుంటే మంచిదే కానీ అతి తెలివుంటే ఇలానే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube