సన్యాసం తీసుకునేంత కష్టం ఈ హీరోయిన్స్ అందరికి ఏం కలిగింది ..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో అందరి కెరియర్ ఒకేలా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఒకరు స్టార్ హీరో గా ఉంటే ఇంకొకరు నార్మల్ హీరోగా ఉంటారు కొందరికి అయితే అసలు ఎన్ని సినిమాలు చేసినా రావాల్సిన గుర్తింపు రాదు మొత్తానికి ఏదో విధంగా ఇక్కడ లైఫ్ ని ముందుకు నెట్టుకుంటూ వస్తూ ఉంటారు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే హీరోయిన్లుగా వచ్చిన వాళ్లు వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇండస్ట్రీలో వాళ్ళ కెరియర్ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ తక్కువ లోనే వాళ్ళు ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు.హీరోలు హీరోయిన్ల గా వాళ్లకు వచ్చిన గుర్తింపులు పక్కనపెడితే వాళ్ల నిజ జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది.

 Well Known Actresses Who Became Nuns In Real Life-TeluguStop.com

ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఆ కారణాల వల్ల వాళ్లు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.హీరోయిన్స్ త్వరగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించి కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి వాళ్ల పర్సనల్ లైఫ్ లో వచ్చిన ఇబ్బందుల వల్ల కొంతమంది హీరోయిన్ గా చాన్సులు వస్తున్నప్పటికీ వాటిని వదిలేసి సన్యాసం తీసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు అలాంటి వారు ఎవరెవరు ఉన్నారో వాళ్లు అసలు ఎందుకు సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం…

సోఫియా హయత్

ఇండియాలో చాలా పాపులర్ అయిన బిగ్ బాస్ షో ప్రస్తుతం అన్ని లాంగ్వేజ్ లో ఈ షో నిర్వహిస్తున్నారు.అయితే బిగ్ బాస్7 లో సోఫియా హయాత్ పాల్గొని అందరినీ ఆకర్షించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.ఈమె బ్రిటిష్ మోడల్ గా, సింగర్ గా, యాక్టర్ గా కూడా మంచి గుర్తింపును సాధించారు అయితే చాలా రోజుల పాటు సింగర్ గా, యాక్టర్ గా కొనసాగిన ఈవిడ తర్వాత సన్యాసిగా మారి కొన్ని రోజులపాటు సన్యాసం లోనే కొనసాగి ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ యధాతధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

మమతా కులకర్ణి

మమతా కులకర్ణి మంచి నటిగా గుర్తింపు సాధించింది చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అలాంటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుని సన్యాసిని గా మారిపోయింది తర్వాత తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని రాసింది.ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగిని అనే పేరుతో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు అయితే ఆ తర్వాత ఈమె ఈమెభర్త ఇద్దరూ కలిసి 20 వేల కోట్ల డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికారు వీళ్లే డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికారా లేదంటే ఎవరైనా కావాలని వీళ్ళని ఇరికించారా అనే విషయం పైన కొన్ని రోజులపాటు కోర్టులో కేసు నడిచినప్పటికీ తానే కోర్టు వీళ్ళని దోషులు అని తేల్చి చెప్పేసింది.

భక్త మదన్

తనదైన నటనతో సినిమాల్లో నటించి వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ నటిగా మంచి గుర్తింపు సాధించింది అయితే అనతికాలంలోనే ఆవిడ సినిమాలకు స్వస్తి చెప్పి దలైలామా ఇన్స్పిరేషన్ తో బుద్ధఇజం తీసుకొని సన్యాసినిగా మారింది.సన్యాసినిగా మారిన తర్వాత తన భక్త మదన్ గా ఉన్న తన పేరుని వెన్ గ్యాంటన్ గా మార్చుకుంది ప్రస్తుతం సన్యాసి గానే కొనసాగుతూ ఉంది.

సుచిత్రాసేన్

25 ఏళ్ల పాటు హీరోయిన్ గా తన హవా ను కొనసాగించిన సుచిత్రాసేన్ ఎన్నో చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి యాక్టర్ అంటే ఇలా ఉండాలి అని చాటిచెప్పిన నటి సుచిత్రా సేన్.వాళ్ళ ఇంట్లో జరిగిన కొన్ని గొడవల కారణంగా ఆధ్యాత్మికం వైపు వెళ్లి స్వామి వివేకానంద నడిచిన దారిలోనే నడుస్తు ఒక సన్యాసినిగా బతికింది ఆ తర్వాత 2014లో ఆవిడ మరణించింది.

మనీషా కొయిరాలా

ఒకే ఒక్కడు, క్రిమినల్, భారతీయుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన మనిషా కొయిరాల కూడా సన్యాసం తీసుకుని కొన్ని రోజులు సన్యాసిగా బతికారు తర్వాత సన్యాసం వదిలేసి మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు.మొత్తానికి అయితే హీరోయిన్లందరూ వాళ్లు బతుకుతున్న లైఫ్ ని కాదనుకొని సన్యాసం తీసుకుని మనం బతికే లైఫ్ కంటే అదే బెటర్ అనుకొని ప్రస్తుతానికి అలాగే బతుకుతున్నారు

 Well Known Actresses Who Became Nuns In Real Life-సన్యాసం తీసుకునేంత కష్టం ఈ హీరోయిన్స్ అందరికి ఏం కలిగింది ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Manisha Koirala #Barkha Madan #BollywoodStar #Heroines #Suchitra Sen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు