ఒలంపిక్స్ క్రీడా విభాగంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పథకం సాధించడం తెలిసిందే.రెండు ఒలంపిక్స్ లో పాల్గొని పథకాలు సాధించిన తొలి భారత మహిళ క్రీడాకారిణిగా… రికార్డు సృష్టించడం జరిగింది.
దీంతో ఒలంపిక్ క్రీడలు ముగించుకుని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధు కి ఘనస్వాగతం లభించింది.ఢిల్లీలో కేంద్ర మంత్రులు పీవీ సింధు ని సత్కరించారు.
భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటే రీతిలో ఒలంపిక్స్ ప్రారంభించినట్లు కొనియాడారు.
కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ వంటి కేంద్ర మంత్రులు పీవీ సింధు ను సత్కరించారు.
బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేలా కీర్తి ప్రతిష్టలు పెంచిన పీవీ సింధు తెలుగు అమ్మాయి కావటం గర్వంగా ఉందని మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.

అంతేకాకుండా వచ్చే ఒలింపిక్స్లో కచ్చితంగా పీవీ సింధు కి స్వర్ణం వస్తుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.