బాత్రుమ్‌లో 10 నిమిషాలే.. వాసన లేదంటే అంతే!  

Weird Rule About Long Washroom Break Sign Goes Viral-viral Post,washroom Break,weird Rule

నేటి సమాజంలో మనుష్యులు వింత అలవాట్లు చేసుకుంటున్నారు.చాలా మంది బాత్రుమ్‌కు వెళ్లేటప్పుడు తమ ఫోన్‌ను తీసుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు.

Weird Rule About Long Washroom Break Sign Goes Viral-viral Post,washroom Break,weird Rule Telugu Viral News Weird Rule About Long Washroom Break Sign Goes Viral-viral Post Washroom Weird-Weird Rule About Long Washroom Break Sign Goes Viral-Viral Post Washroom

వీరిలో కొంతమంది బాత్రుమ్‌లో గేమ్స్ ఆడుతూ తమ పని చేస్తుంటారు.అయితే ఇలాంటి పనులు ఆఫీసులో చేసే వారి సంఖ్య కూడా ఉంది.

ఇది గమనించిన ఓ కంపెనీ ఒక వినూత్న ఆలోచనకు తెరలేపింది.

తమ కంపెనీలో ఉద్యోగం చేసే ఉద్యోగులు బాత్రుమ్‌లో 10 నిమిషాలకంటే ఎక్కువ ఉండకూడదని, అలా ఉన్నట్లయితే బాత్రుమ్‌ వాసన చూస్తారని, అందులో దుర్వాసన రాకపోతే వారి పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తామని ఓ నోటీసును అంటించారు.

ఇది పాటిస్తే తమ కంపెనీ ఉద్యోగులు ఎక్కువసేపు బాత్రుమ్‌లో గడపకుండా ఉండగలరని సదరు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది.

కాగా ఈ నోటీసును ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని కొందరు కామెంట్ చేస్తే, బాత్రుమ్ వాసన చూసే ఆ అదృష్టవంతులు ఎవరు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా బాత్రుమ్‌లో 10 నిమిషాల నోటీసు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజా వార్తలు