ఊబకాయంను అంతం చేయటానికి 7 సమర్ధవంతమైన మార్గాలు  

7 Effective And Simple Weight Loss Tips -

ఊబకాయంను అంతం చేయటానికి ముందు, ఊబకాయం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.అధిక బరువు లేదా కొవ్వు అధికంగా ఉండటాన్ని వైద్యపరంగా ఊబకాయం అని అంటారు.

ఊబకాయం రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.ప్రాసెస్డ్ చేసిన ఆహారం, కృత్రిమ ఆహారం,సోడా,కోక్, బ్రేక్ ఫాస్ట్ మానేయటం వంటి అనేక కారణాలు ఉన్నాయి.

7 Effective And Simple Weight Loss Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఊబకాయం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది.ఇప్పుడు ఊబకాయంను అంతం చేసే మార్గాలను తెలుసుకుందాం.1.మంచి ఆహారం తీసుకోవాలి మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అని చెప్పారు.

అటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.మనం తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.మనం పండ్లు లేదా వేగించిన ఆహారాలు వేటిని తీసుకున్న సరే ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో చూసుకోవాలి.2.చక్కెర తీసుకోవడం మానేయాలి చక్కెర అణువులు మీ శరీరంలోకి చేరినప్పుడు శరీర షేప్ ని మారుస్తాయి.చక్కెరలో అత్యధికంగా కేలరీలు ఉంటాయి.చక్కెర కొవ్వుగా మారుతుంది .ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది.ఊబకాయం నుండి దూరంగా ఉండాలంటే మొదట చక్కెరను వాడటం మానేయాలి.

3.బ్రేక్ ఫాస్ట్ మానకూడదు బ్రేక్ ఫాస్ట్ చేయటం ఆసలు మానకూడదు.ఎందుకంటే ఖాళీ కడుపు ఊబకాయంనకు మంచి స్నేహితుడు.4.ఆల్కహాల్ మానేయాలి వారాంతాలలో స్నేహితులతో కలిసి మద్యం త్రాగాటాన్ని ఇష్టపడవచ్చు.

కానీ ఆల్కహాల్ లో కొవ్వు మరియు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.మంచి ఆరోగ్యం కావాలంటే ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.5.తగినంత నీటిని త్రాగాలి నీరు ఒక సహజ ప్రక్షాళన వలే పనిచేస్తుంది.

ప్రతి రోజు 4 నుండి 5 లీటర్ల నీటిని త్రాగాలి.నీరు మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును సమర్దవంతంగా బయటకు పంపటంలో సహాయపడుతుంది.6.వ్యాయామం కేలరీలు ఖర్చు కావాలంటే ఆహార నియంత్రణ ఒక్కటే సరిపోదు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తేనే అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది.ప్రతి రోజు అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.7.మంచి నిద్ర చాలా సందర్భాల్లో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఊబకాయం వస్తుంది.

మన శరీరం రీఛార్జి అయ్యి నూతన ఉత్సాహంతో ఉండాలంటే రాత్రి సమయంలో మంచి నిద్ర అవసరం.ప్రతి రోజు 8 గంటల నిద్ర అవసరం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

7 Effective And Simple Weight Loss Tips- Related....