బరువు తగ్గాలంటే ....ఈ డ్రింక్స్ తప్పనిసరి

బిజీగా మారిన జీవనశైలి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం వలన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.వాటిలో స్థూలకాయం ఒకటి.

 Weight Loss Juices, Healthy Drinks, Juices To Reduce Weight-TeluguStop.com

అధిక బరువు ఉన్నవారు ఎలాగైనా బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలను ఉంటారు.కొన్ని ఆహారపదార్ధాలు బరువును తగ్గించటానికి సహాయపడతాయి.వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.

కూరగాయ జ్యుస్


కూరగాయలలో అధిక ఫైబర్ ఉండుటవలన కడుపు నిండిన భావన కలుగుతుంది.దాంతో తీసుకొనే ఆహారం మోతాదు తగ్గుతుంది.ఎక్కువ సేపు ఆకలి వేయదు.అందువల్ల కూరగాయల జ్యుస్ త్రాగితే బరువు తగ్గవచ్చు.

ద్రాక్ష రసం


ద్రాక్ష రసంలో విటమిన్ సి తో పాటు జీర్ణక్రియను పెంచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.శరీరంలో పేరుకుపోయిన విషాలను బయటకు పంపుతుంది.ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ


దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్,జీర్ణక్రియను పెంచే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది.గ్రీన్ టీని వేడిగా లేదా చల్లగా అయినా త్రాగవచ్చు.అయితే పంచదార ఉపయోగించకూడదు.

నీరు


ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగితే శరీరంలో విషాలు అన్ని బయటకు పోతాయి.గోరువెచ్చని నీటిని త్రాగితే కొవ్వు తొందరగా కరుగుతుంది.

కొబ్బరి నీరు


ప్రతి రోజు రెండు గ్లాసుల కొబ్బరి నీటిని త్రాగుతూ ఉంటే బరువు తగ్గటమే కాకుండా శరీరంలో విషాలు బయటకు పోతాయి.అంతేకాక జీర్ణక్రియ రేటును పెంచుతుంది.

బ్లాక్ కాఫీ


బరువును తగ్గించటంలో బ్లాక్ కాఫీ బాగా సహాయపడుతుంది.ఇది మెటబాలిజం రేటును బాగా పెంచి ఆకలి ఎక్కువసేపు వేయకుండా చేస్తుంది.ప్రతి రోజు రెండు కప్పుల బ్లాక్ కాఫీని పంచదార లేకుండా త్రాగితే నెల రోజుల్లో బరువు తగ్గిపోతారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube