డైటింగ్ చేయకుండానే ఈజీగా బరువు త‌గ్గండిలా..!!

అధిక బ‌రువు.నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఇది.ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేంద‌కు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే ముఖ్యంగా నోరుక‌ట్టేసుకోవ‌డం, గంటల కొద్దీ వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తుంటారు.

 How To Lose Weight Without Dieting, Weight Loss, Dieting, Daily Food Cycle Chang-TeluguStop.com

అయితే ఎన్ని ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేసినా ఫ‌లితం లేక తెగ బాధ‌ప‌డుతుంటారు.వాస్త‌వానికి బరువు తగ్గడం అంటే ఏమి తినకుండా నోరు క‌ట్టేసుకుని కడుపు మాడ్చుకోవడం కాదు.

ఎందుకంటే.ఎలాంటి డైట్ లేకుండా కూడా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.డైట్ లేకుండా అంటే.ఏది ప‌డితే అది, ఎంత ప‌డితే అంత తిన‌డం కాదండోయ్‌.

ఇష్ట‌మైన ఫుడ్‌ను మితంగా తీసుకుంటూ బ‌రువు తగ్గొచ్చు.అయితే ఆ ఫుడ్‌లో ఖ‌చ్చితంగా ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండాలి.కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండాలి.ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే చికెన్, ఫిష్, సీ ఫుడ్, ఎగ్స్ లాంటివి డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే ప్ర‌తిరోజు నీళ్లు ఎక్కువ‌గా తీసుకోవాలి.

Telugu Exercise, Cycle Change, Ginger Garlic, Protins-

అదేవిధంగా, మనం ఏమైనా ఆహారం తినే సమయంలో తొందరతొందరగా తిన కూడ‌దు.అలా తినడం వల్ల‌ ఆహారం తొందరగా జీర్ణం అవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా.బ‌రువు పెర‌గ‌డానికి కూడా కార‌ణం అవుతుంది.

అందుకే ఏమైనా ఆహారం తినేట‌ప్పుడు బాగా న‌మిలి తినాలి.మ‌రియు ప్ర‌తి రోజు ఉద‌యం వేడినీటిలో కొద్దిగా నిమ్మ‌రసం, తేనె మిక్స్ చేసి క్ర‌మం త‌ప్ప‌కుండా తాగాలి.

అలాగే మొలకెత్తిన పెసలు, డ్రై న‌ట్స్, వెల్లుల్లి, అల్లం, ఆకుకూర‌లు వంటివి డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.ఇక వీట‌న్ని‌టితో పాటు ప్ర‌తి రోజు ఒక గంట వ్యాయామం చేయ‌డం వ‌ల్ల బ‌రువు ఈజీగా త‌గ్గొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube