బరువు తగ్గే క్రమంలో చేసే ప్రధానమైన తప్పులు  

  • చాలా మంది జీవితంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా ఉంది. బరువు తగ్గటానికి అనేక రకాలైన ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. వ్యాయామం,డైట్ చేయటం వంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు. దాంతో చాలా మంది తిండి తినటం మానేసి బరువు తగ్గాలని భావిస్తారు. అయితే ఆహారం తీసుకోవటం మానేయటం వలన లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇప్పుడు బరువు తగ్గే క్రమంలో చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.

  • నిద్రలేమి సమస్య కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమి కారణంగా అలసట ఎక్కువ అయ్యి పిండి పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటారు. దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోజులో 7 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

  • Weight Loss Common Mistakes-

    Weight Loss Common Mistakes

  • సరైన ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకొనే ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఎంత ఆహారం తీసుకున్న ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువగా ఉంటుంది.

  • ఆహార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. తీసుకుంటున్న కేలరీలను ట్రాక్ చేయాలి. ఖర్చు అయ్యే కేలరీల సంఖ్య మీద అవగాహన ఉంటే దానిని బట్టి డైట్ తీసుకోవచ్చు. లేకపోతే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతున్నాయో తెలియక ఇబ్బంది పడి ఎంత ఆహారం తీసుకోవాలో తెలియదు.

  • ముఖమైన విషయం ఏమిటంటే బరువు తగ్గే క్రమంలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తు ఉంటారు. ఆలా మానేయటం వలన లంచ్ ఎక్కువ మొత్తంలో తినటం జరుగుతుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు స్థిరత్వం తగ్గుతుంది.