బరువు తగ్గే క్రమంలో చేసే ప్రధానమైన తప్పులు

చాలా మంది జీవితంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా ఉంది.బరువు తగ్గటానికి అనేక రకాలైన ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

 Weight Loss Common Mistakes , Weight Loss, Health , Health Tips, Calories-TeluguStop.com

వ్యాయామం,డైట్ చేయటం వంటివి ఎన్నో చేస్తూ ఉంటారు.అయినా పెద్దగా ఫలితం ఉండదు.

దాంతో చాలా మంది తిండి తినటం మానేసి బరువు తగ్గాలని భావిస్తారు.అయితే ఆహారం తీసుకోవటం మానేయటం వలన లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుంది.

అయితే ఇప్పుడు బరువు తగ్గే క్రమంలో చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.

నిద్రలేమి సమస్య కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

నిద్రలేమి కారణంగా అలసట ఎక్కువ అయ్యి పిండి పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటారు.దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల రోజులో 7 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి.సరైన ఆహారాన్ని తీసుకోవాలి.

తీసుకొనే ఆహారంలో పోషక విలువలు ఉండేలాచూసుకోవాలి.లేకపోతే ఎంత ఆహారం తీసుకున్న ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువగా ఉంటుంది.

ఆహార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.తీసుకుంటున్న కేలరీలను ట్రాక్ చేయాలి.ఖర్చు అయ్యే కేలరీల సంఖ్య మీద అవగాహన ఉంటే దానిని బట్టి డైట్ తీసుకోవచ్చు.లేకపోతే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతున్నాయో తెలియక ఇబ్బంది పడి ఎంత ఆహారం తీసుకోవాలో తెలియదు.

ముఖమైన విషయం ఏమిటంటే బరువు తగ్గే క్రమంలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్మా నేస్తు ఉంటారు.ఆలా మానేయటం వలన లంచ్ ఎక్కువ మొత్తంలో తినటం జరుగుతుంది.

అలాగే రక్తంలో చక్కర స్థాయిలు స్థిరత్వం తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube