పాయల్ పాపను ఇబ్బంది పెడుతున్న అంశం ఏమిటంటే?  

Weight Gain Troubles Payal Rajput, Payal Rajput, RX 100, Lockdown, Tollywood News - Telugu \\'rx 100\\', Lockdown, Payal Rajput, Tollywood News

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ సినిమాతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది.ఈ బ్యూటీ ఎక్స్‌పోజింగ్‌కు ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు.

TeluguStop.com - Weight Gain Troubles Payal Rajput

ఇక ఆర్ఎక్స్ 100 చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున నీరాజనాలు పట్టడంతో ఆ తరువాత వరుసబెట్టి ఆఫర్లు దక్కించుకుంది ఈ బ్యూటీ.కానీ అమ్మడికి అదృష్టం మాత్రం అంతగా కలిసి రాలేదు.

దీంతో పాయల్ రాజ్‌పుత్ అంటే కేవలం ఆర్ఎక్స్ 100 హీరోయిన్‌గా మాత్రమే గుర్తింపును తెచ్చుకుంది.

TeluguStop.com - పాయల్ పాపను ఇబ్బంది పెడుతున్న అంశం ఏమిటంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే పాయల్ రాజ్‌పుత్‌కు ప్రస్తుతం ఆఫర్లు పెద్దగా లేవనే చెప్పాలి.

కానీ తనకున్న ఇమేజ్‌ను వాడుకునే సినిమా ఛాన్సులు కొట్టేయాలని చూస్తోంది.కానీ తనకు కరోనా కష్టకాలం పెద్ద తలనొప్పిని మిగిల్చింది.

ఇప్పటికే ఆఫర్లు లేని పాయల్, లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై వర్కవుట్స్ చేయడం మానేసింది.దీంతో ఆమె ఎక్కువ బరువు పెరిగిందట.లాక్‌డౌన్‌లో అమ్మడు ఏకంగా 62 కేజీలకు పెరిగిందని, కొంతమేర బరువు తగ్గించుకుని 58.5 కేజీల వరకు రాగలిగిందట.అయితే అమ్మడు మునుపటి 52 కిలోల బరువు వచ్చే వరకు కష్టపడతానంటోంది.

ఇక ఇటీవల తరుచూ ముంబై నుండి హైదరాబాద్ రావాల్సి వస్తుండటంతో, పాయల్ పాప ఇక్కడే ఓ ఇల్లు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

ఫ్యామిలీతో సహా ఇక్కడే మకాం పెట్టాలని చూస్తోంది.ఏదేమైనా ఈ కరోనా కష్టకాలం ఒక్కొక్కరికి ఒక్కో సమస్యను తెచ్చిపెడితే, పాయల్‌కు ఇలా అధిక బరువు సమస్యను తెచ్చిపెట్టిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

సరైన పద్ధతిలో వర్కవుట్స్ చేస్తే అమ్మడు బరువు తగ్గించుకోవడం పెద్ద సమస్య కాదని వారు సూచిస్తున్నారు.మరి పాయల్ పాప సమస్య ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.ఇక సినిమాల విషయానికి వస్తే పాయల్ ప్రస్తుతం నరేంద్ర అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది.

#Lockdown #'RX 100' #Payal Rajput

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Weight Gain Troubles Payal Rajput Related Telugu News,Photos/Pics,Images..