అరెరే: చేప మెడలో వెడ్డింగ్ రింగ్.. అసలు మేటరేంటంటే..?!

మానవుడు పారేసిన వ్యర్థాలన్నీ సముద్రాలను కలుషితం చేయడం ప్రపంచ సమస్యగా మారింది.ఈ హానికర వ్యర్థాలతో వన్యప్రాణాలకు ప్రాణసంకటంగా దాపరించింది.

 Wedding Ring In Fish Neck Due To Human Wastage Disposal In Sea , Viral News, Vir-TeluguStop.com

భారీ మొత్తంలో హానిక ప్లాస్టిక్ సముద్రాల్లోకి కలిసిపోతోంది.ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రాల్లోని జంతుజాతుల మనుగడ సాగించడం కష్టంగా మారింది.

చాలావరకు జలచరాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అంతరించిపోతున్నాయి.అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నార్ఫోక్ ద్వీపం ఒడ్డున ఒక చేప కనిపించిన తీరు కనిపిస్తే ఆందోళన కలిగిస్తోంది.

సముద్ర జీవులకు మానవుడి వాడిపారేసిన వ్యర్థాలతో ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది.నార్ఫోక్ ద్వీపం పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా బాహ్య భూభాగంలో ఉంది.

న్యూజిలాండ్, న్యూ కాలెడోనియా మధ్య ఉంది.ఈ సముద్ర తీరంలో ఒక చేప మెడలో వెడ్డింగ్ బంగారపు ఉంగరంతో మెరిసింది.

ఫిబ్రవరి 2021లో సుషాన్ ప్రియర్ అనే రెసిడెంట్ కొన్ని చేపలను గుర్తించారు.

ఆ ఫొటోలను తన బ్లాగులో షేర్ చేశారు.

ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు సముద్రంలోని అడుగుభాగానికి చేరుకుంటాయి.ఎవరో తమ వెడ్డింగ్ రింగును సమద్రంలో పొగట్టుకున్నారు.

ఆ బంగారం ఉంగరం సముద్రం అడుగుభాగానికి చేరుకుంది.సముద్రంలోని ఇసుకలో అవి అంటిపెట్టుకునిపోతాయి.

ఆహారం కోసం వెతుకుతూ తిరిగే చేపలు వంటి జలచరాలకు ఈ వ్యర్థాలు ప్రాణసంకటంగా మారాయి.ఆహారం కోసం వెతికే క్రమంలో ఒక ఉంగరం లేదా హెయిర్ టై చేపల ముక్కకు చిక్కుకోవడం వంటి జరుగుతుంటాయని ప్రియర్ అభిప్రాయపడ్డారు.

చేప మెడకు ఏదో చుట్టుకున్నట్టుగా కనిపించిందని, దగ్గరగా పరిశీలిస్తే అది మెరిసే విలువైన బంగారపు ఉంగరమని గ్రహించారు.దీంతో వెంట‌నే ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

అవి కాస్తా వైర‌ల‌య్యాయి.అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్య‌క్తి ఆ రింగ్ త‌నేదే అని, ఒకసారి ఆ స‌ముద్రంలో ఈత‌కు వెళ్లిన‌ప్పుడు దాన్ని పోగొట్టుకున్నాన‌ని చెప్ప‌డం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube