న్యూ కపుల్‌ రొమాన్స్‌లో ఉండగా ఈ జిరాఫీ ఏం చేసిందో చూడండి

అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి.కొన్ని సంఘటనలు భయంతో కంపించేలా చేస్తాయి.

 Wedding Photos With A Giraffe See What Happens In Last-TeluguStop.com

తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన ఒక సంఘటన కొత్త దంపతుల జీవితంలో తీపి గుర్తుగా మారిపోయింది.వారిద్దరు కూడా జీవితాంతం మర్చి పోలేని ఆ సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అమెరికాలో ఇండియన్స్‌కు ఎదురైన ఈ అనుభవం తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… భారతీయ కుటుంబాలకు చెందిన అమీశ్‌ ఇంకా మేఘనాల వివాహం కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరిగింది.

వారి పెళ్లి వేడుక పూర్తి అయిన తర్వాత ఫొటో షూట్‌ కోసం ఒక జూ కమ్‌ పార్క్‌కు వెళ్లారు.అక్కడ ఫొటోలు నాచురల్‌గా వచ్చేందుకు కొత్త జంటను రొమాన్స్‌లో మునిగి పోవాలంటూ ఫొటోగ్రాఫర్‌ సూచించాడు.

ఎంతగా అంటే వారిద్దరు కూడా రొమాన్స్‌లో మునిగి పోయారు.ఆ సమయంలో వారి పక్కన జిరాఫీ ఉందనే విషయాన్ని కూడా మర్చి పోయినట్లుగా ఉన్నారు.

Telugu Giraffe, Romance-Latest News - Telugu

కొత్త జంట రొమాంటిక్‌ మూడ్‌ లో ఉన్న సమయంలో వెనుక నుండి వచ్చిన జిరాఫీ వారిద్దరిని డిస్టబ్‌ చేసింది.అనూహ్యంగా జిరాఫీ పెళ్లి కొడుకు తలపాగా లాగేందుకు ప్రయత్నించింది.వెంటనే తేరుకున్న పెళ్లి కూతురు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు.మరో ఫొటో గ్రాఫర్‌ వెళ్లి ఆ తలపాగాను జిరాఫీ నుండి లాగాడు.

ఈ సంఘటనతో పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు చాలా నవ్వుకున్నారు.అదే సమయంలో ఇదంతా కూడా వీడియోలో రికార్డ్‌ అయ్యిందని చెప్పగానే పెళ్లి కొడుకు ఆనందంకు మరింత అవదులు లేకుండా పోయింది.

ఈ కపుల్‌ ఫొటో షూట్‌ వీడియో వైరల్‌ అవ్వడంతో వారిద్దరు చాలా ఫేమస్‌ అయ్యారు.వారిద్దరికి లక్షల మంది పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఒకవేళ అది జిరాఫీ కాకుండా ఏ పులినో అయ్యి ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube