మన దేశం లో ఉన్న సంప్రదాయాలు వేరే దేశంలో ఉండవు.మరీ ముఖ్యంగా పెళ్లి అంటే ఇంకా చాలా సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఇలా చాలానే ఉంటాయి.
ఒక్కో ప్రాంతంలో ఆచారాలు ఒక్కో విధంగా ఉంటాయి.పెళ్లి అప్పుడు వరుడిని గుర్రం మీద ఊరేగిస్తూ ఉంటారు.
కొంతమందికి ఇది ఆచారంగా ఉంటే మరి కొంతమంది మాత్రం ఇప్పుడు అలా పెళ్లి కొడుకుని ఊరేగించడం ఫ్యాషన్ అయి పోయింది.
అయితే తాజాగా ఒక పెళ్లి ఊరేగింపులో అనుకోని అనూహ్య సంఘటన జరిగింది.
ఆ ఉరిగింపులో జరిగిన ఘటన చూసి అందరు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు.అసలు ఏం జరిగిందంటే.
ఆ పెళ్లి ఊరేగింపులో వరుడిని గుర్రం మీద ఉరేగిస్తున్నారు.అప్పుడే ఆ గుర్రం చేసిన పనికి అందరికి ఫ్యూజులు ఎగిరి పోయాయి.
అందరు చూస్తుండగానే ఆ గుర్రం వరుడితో సహా పారి పోయింది.

ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.అక్కడ పెళ్లి ఊరేగింపు జరుగుతున్నా సమయంలో ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో బంధువులు ముందు షాక్ అయినా ఆ తర్వాత ఆ గుర్రం వెంబటే పరుగులు పెట్టాల్సి వచ్చింది.ఈ గుర్రం పెళ్లి కొడుకుని 4 కిలో మీటర్లు తీసుకెళ్లింది.
వరుడు ఊరేగింపు సమయంలో పేల్చినా బాణాసంచా కారణంగా గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయింది.

గుర్రంతో పాటు వచ్చిన వ్యక్తి ఎంత ఆపిన ఆగకుండా వరుడితో సహా పరుగు పెట్టింది.అలా ఆ గుర్రం వరుడిని 4 కిలో మీటర్లు తీసుకు వెళ్ళింది.వరుడు బంధువులు ఆ గుర్రం వెంటే కార్లలో వెంబడించి మొత్తానికి క్షేమంగా తీసుకు వచ్చారు.
ఈ ఘటనలో వరుడికి ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.