వెరైటీ శుభలేఖ : పెళ్ళికి రండి ... మోదీకి ఓటెయ్యండి  

Wedding Card Asks Vote For Modi -

దేశంలో ఎలక్షన్ ఫీవర్ సామాన్యుల నుంచి సంపన్నుల వరకు… చదువుకున్న వారి నుంచి చదువుకోనివారి వరకు అందరికీ వచ్చేసింది.ఇప్పుడు ఎక్కడ ఏ నలుగురు మాట్లాడుకున్నా….

Wedding Card Asks Vote For Modi

ఆ మాటలన్నీ రాజకీయాల గురించే అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది.ఇక విషయానికి వస్తే… గుజరాత్ అంటేనే మన ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తాడు.

అక్కడ ఆయనకు అభిమానులు కూడా చాలా ఎక్కువ.దీంతో వారు తమ అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు.

తమ పిల్లలకు వివాహాలు చేయాలనుకునే తల్లిదండ్రులు .వారు ప్రింట్ చేయించే పెళ్లి పత్రికలపై మోడీ ప్రచారాన్ని ప్రారంభించారు.

ఆ కార్టులో పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలతో పాటు 2019 ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలని పెళ్లి కార్డ్ బాటమ్ లో ప్రింట్ చేయిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.గుజరాత్ లో ఇప్పుడు ఇది క్రేజీగా మారింది.ఇంకొందరైతే ఏకంగా పత్రికలో మోడీ ఫోటో పెట్టి ….ఆయన పథకాలను సైతం ప్రచారం చేస్తున్నారు.అంతటితో ఆగకుండా ఫేస్ బుక్ ,ట్విట్టర్ లాంటి వాటిల్లో పత్రికలను పోస్ట్ చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు ఈ పోస్టులు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు

Wedding Card Asks Vote For Modi- Related....