హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌లకు పారితోషికం ఎలా తీసుకుంటారో తెలుసా?

స్టార్‌ హీరోయిన్స్‌ నుండి చిన్న హీరోయిన్స్‌ వరకు ఇప్పుడు అంతా కూడా వెబ్‌ సిరీస్‌ వెంట పడుతున్నారు.పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు హీరోలు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న ఈ సమయంలో హీరోయిన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

 Actress Remmunaration In Web Series, Actress, Webseries, Remmunaration, Ott, Tol-TeluguStop.com

అయితే వెబ్‌ సిరీస్‌ల బడ్జెట్స్‌ మరియు హీరోయిన్స్‌ తీసుకునే పారితోషికాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి అనుమానంగా ఉంది.మాకు అందిన సమాచారం ప్రకారం హీరోయిన్స్‌ వెబ్‌ సిరీస్‌లకు తక్కువ రోజులు డేట్లు ఇస్తారు.

దానికి తగ్గట్లుగానే కాస్త తక్కువ పారితోషికంను అందుకుంటున్నారు.

ఉదాహరణకు ఒక్క సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్‌ ఒక వెబ్‌ సిరీస్‌ కు కమిట్‌ అయితే ఆమెకు వెబ్‌ సిరీస్‌లో నటించినందుకు కోటి ఇవ్వడం సాధ్యం కాదు.

అయితే ఆమె స్థాయికి తగ్గట్లుగా ఆమె పాత్రకు తగ్గట్లుగా పారితోషికం ఇస్తారు.ఎక్కువ శాతం వెబ్‌ సిరీస్‌ నటీనటులకు రోజు వారి పారితోషికం ఉంటుందని తెలుస్తోంది.స్టార్స్‌ హోదాను బట్టి వారి వారి పారితోషికాలను ఖరారు చేయడం జరుగుతుంది.

కొందరు హీరోయిన్స్‌ ముందుగానే ఇన్ని రోజులు డేట్లు ఇస్తాను ఇంత పారితోషికం కావాలని గుండు గుత్తగా ఒప్పందం చేసుకుంటారు.

కాని ఎక్కువ శాతం హీరోయిన్స్‌ మాత్రం రోజుల లెక్కలోనే ప్రస్తుతానికి పారితోషికంను అందుకుంటున్నారు.కోటి హీరోయిన్‌కు ఒక వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటించినందుకు గాను 20 నుండి 30 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.

పాటలు ఉండక పోవడంతో పాటు తక్కువ రోజులు వర్క్‌ చేస్తారు.కనుక ఆ మోతాదులో పారితోషికం వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube