ఆ రాష్ట్రంలో మున్సిపాలిటీ పరిధిలో హెల్మెట్ అవసరం లేదు  

Wearing helmet is now optional in Gujarat cities - Telugu Bjp Government, Motor Vehicle Act, Now Optional In Gujarat Cities, Wearing Helmet

సిటీలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వాహన ప్రమాదాలు తక్కువగా జరుగుతుంటాయి.ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి కూడా చాలా జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ఉంటారు.

Wearing Helmet Is Now Optional In Gujarat Cities

గల్లీలో రహదారులు పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కారణంగా సిటీలో బైక్ జర్ని చేసేవాళ్ళు హెల్మెట్ పెద్దగా పెట్టుకోరు.

అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త మోటారు వాహన చట్టం కారణంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూడా చాలావరకు హెల్మెట్ దర్శిస్తారు.

అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం టు వీలర్ వాడే వాళ్లకి శుభవార్త చెప్పింది.

గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం అక్కడ మున్సిపాలిటీలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.

ఇక మున్సిపాలిటీ పరిధిలో బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమల్లోకి తీసుకువస్తున్నారని తెలియజేసింది.

మున్సిపాలిటీల్లో హెల్మెట్ పెట్టుకోవాలా… వద్దా అనేది వాహనదారులు ఇష్టమని, అయితే టౌన్ లోని రోడ్లు దాటి జాతీయ రహదారులు మీద ప్రయాణం చేసేటప్పుడు, ఇతర గ్రామాల వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది.దీనిపై మున్సిపాలిటీ పరిధిలో ద్విచక్ర వాహనాలు హర్షం వ్యక్తం చేశారు.

అలాంటి సవరణ దేశంలో ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా తీసుకురావాలని సోషల్ మీడియాలో చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మరి దీనిపై మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.

#Wearing Helmet #BJP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Wearing Helmet Is Now Optional In Gujarat Cities Related Telugu News,Photos/Pics,Images..