ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఇంక మూడు నెలల సమయం మాత్రమే ఉంది.దీంతో ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఏపీలో రాజకీయ వాతావరణం గమనిస్తే గత ఎన్నికల కంటే 2024 ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయి.ప్రస్తుతం వైసీపీ( ycp ) అధికారంలో ఉంది.
వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతుంది.తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం జరిగింది.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) మొన్నటి వరకు పాదయాత్ర చేసి బిజీ బిజీగా గడిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం జరిగింది.ఈ క్రమంలో అనేక ప్రజా సమస్యలను లోకేష్ దృష్టికి రావటం జరిగింది.కాగా తాజాగా వారు వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.2024 ఎన్నికలలో అనుసరించే వ్యూహాలు గురించి అమలు చేసే పథకాలు ఇంకా హామీలు గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2024 ఎన్నికలలో.వార్ వన్ సైడ్ అవుతుందని అన్నారు.175 నియోజకవర్గాలకు 160 స్థానాలు గెలవబోతున్నట్లు తాను అంచనా వేసినట్లు లోకేష్ తెలియజేయడం జరిగింది.ఈ వీడియో లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.