బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ను ప్రజలు నిలదీయాలని తెలిపారు.
ఓఆర్ఆర్ ను అమ్ముకుంటే తప్ప పైసలు లేవని ఎమ్మెల్యే ఈటల ఆరోపించారు.గతంలో ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ వచ్చేదన్న ఆయన ఇప్పుడు కేసీఆర్ ఓకే చేస్తే తప్ప పెన్షన్ వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.
ప్రజలకు కాంగ్రెస్ చాలా హామీలు ఇస్తుందన్నారు.అయితే రూ.2 లక్షల రుణమాఫీ దేవుడు దిగివచ్చినా చేయడం కష్టమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.
ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో త్వరలోనే చెబుతామని స్పష్టం చేశారు.