హీరో విలన్‌ వేషం  

We Will See Sivaji In Villain Role -

హీరోగా పలు సినిమాల్లో నటించిన శివాజీ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.ఈయన ఎప్పుడో నటించిన ‘బూచమ్మ బూచోడు’ ఇటీవలే విడుదల అయ్యింది.

ఆ సినిమా కూడా ఈయనకు పెద్దగా ఫలితాన్ని, గుర్తింపును తీసుకు రాలేదు.కొన్నాళ్లుగా ఈయన రాజకీయాతో బిజీగా ఉన్నాడు.

We Will See Sivaji In Villain Role--Telugu Tollywood Photo Image

ఆ మధ్య బీజేపీలో కీ రోల్‌ పోషిస్తాడని భావించినా, ప్రత్యేక హోదా అంటూ బీజేపీ అధినాయకత్వంపైనే కత్తులు దూశాడు.కొంత కాంగా ఏపీకి ప్రత్యేక హోదా అంటూ రౌండ్‌ టేబుల్‌ సమావేశాు ఏర్పాటు చేసిన శివాజీ తాజాగా మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

హీరోగా ఇప్పటికే ఈయన క్రేజ్‌ కోల్పోయాడు.ఈయన సినిమాల్లో హీరోగా నటించే అవకాశాలు రావడం లేదు.దాంతో ఈయన హీరోగా ప్రయత్నాలు మాని విలన్‌గా నటించాలని నిర్ణయించుకున్నాడు.తాజాగా ఈయన నటించిన చిత్రం ‘షీ’.

ఈ సినిమాలో చాలా కీలకమైన విలన్‌ రోల్‌లో శివాజీ నటించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.తప్పకుండా ‘షీ’కి శివాజీ విలన్‌ రోల్‌ హెల్ప్‌ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమాలో శివాజీ నటించాడు అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.వచ్చే నెల రెండవ వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో మెహత్‌ రాఘవేంద్ర హీరోగా నటించగా, సోనియా అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు