తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.రైతుల పథకాల పేరుతో దోచుకుంటున్నారన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో పెద్ద అవినీతి జరుగుతోందని చెప్పారు.
రాష్ట్రంలోని రైతులకు మాత్రం సాగునీరు అందడం లేదని మోదీ పేర్కొన్నారు.
రుణమాఫీ చేస్తామని తెలంగాణ రైతులను మోసం చేశారని ఆరోపించారు.బీజేపీ కార్యకర్తల ఉత్సాహంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు నిద్రపట్టదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి గిరిజనుల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు తెలుసన్నారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.కుటుంబ పార్టీలతోనే తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లో కుటుంబ సభ్యులే ఉంటారని విమర్శలు చేశారు.