భారతీయ కార్మికులు, విద్యార్ధులను ఆకర్షించేందుకు శ్రమిస్తున్నాం : ఇండియాలో జర్మనీ రాయబారి

భారతదేశం నుంచి నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్ధులను ఆకర్షించడానికి జర్మనీ ప్రయత్నం చేస్తోందన్నారు భారత్‌లో ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్. విద్యార్ధి వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి జర్మనీకి అదనపు సమయం పడుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

 We Make Extra Effort To Woo Indian Workers Students German Envoy To India Philip-TeluguStop.com

  దరఖాస్తుల సంఖ్య, నకిలీ దరఖాస్తులను తొలగించాల్సిన అవసరం వుండటమే దీనికి కాణమని ఫిలిప్ తెలిపారు.డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత భారత విదేశాంత మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌లు మైగ్రేషన్, మొబిలిటీ ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఒప్పందం భారత్, జర్మన్ పౌరులు రెండు దేశాలలో అధ్యయనం చేయడానికి, పనిచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.కుక్‌లు, నర్సులు, ఐటీ నిపుణులు ఇలా నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం జర్మనీకి ఎల్లప్పుడూ వుంటుందని అకెర్‌మాన్ అన్నారు.

డిసెంబర్ 2021 నాటికి జర్మనీలో 1,60,000 మంది భారతీయ పౌరులు… 43,000 మంది భారతీయ సంతతికి చెందినవారు నివసిస్తున్నారని అంచనా.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అకెర్‌మాన్ పేర్కొన్నారు.

అలాగే జర్మనీలో 34 వేలకు పైగా భారతీయ విద్యార్ధులు చదువుకుంటున్నారని ఆయన చెప్పారు.నిన్నటి వరకు భారతీయులకు జర్మనీలో చదువు పూర్తయిన తర్వాత.

మీకు ఉద్యోగం దొరకడానికి ఏడాది సమయం పట్టేదని.కానీ ఇప్పుడు నెలకు మించి కూడా అవసరం లేదని అకెర్‌మాన్ చెప్పారు.

 స్టూడెంట్ వీసాలను ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పడుతోందని అకెర్‌మాన్ పేర్కొన్నారు.వారానికి వెయ్యి దరఖాస్తులు వస్తున్నాయని.

Telugu Germanenvoy, Germany, India, India Germany, Indian, Mea Jaishankar, Visas

వీటిలో 10 శాతం మోసపూరితమైనవేనని, అలాంటి వాటిని తొలగించేందుకు ప్రయత్నించాల్సి వుందన్నారు.ఇకపోతే… ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ రీసెర్చ్ ప్రకారం.జర్మనీకి ప్రతి యేటా 4 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమని అంచనా.అయితే గతేడాది రెండు లక్షల మంది విదేశీయులు జర్మనీకి రాగా.వీరిలో భారతీయులదే అగ్రస్థానం.డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్న జర్మనీకి భారీగా నిపుణులు అవసరం.

అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు పౌరసత్వ చట్టాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది.ఇది విదేశీ వృత్తి నిపుణులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తుంది.

అలాగే విదేశీయులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు జర్మనీలో కనీసం ఎనిమిదేళ్లు వుండాలన్న నిబంధనను ఐదేళ్లకు తగ్గిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube