గుండె పోటు తో హఠాన్మరణం చెందిన ప్రముఖ కమెడియన్  

We Loose Our Prominent Comedian With Heart Attack-

గుండె పోటు తో ప్రముఖ కమెడియన్ హఠాన్మరణం చెందారు.ప్రముఖ తమిళ హాస్య నటుడు అయిన క్రేజీ మోహన్ గుండె పోటు తో హఠాన్మరణం పొందారు.సోమవారం మధ్యాహ్నం ఆయనకు గుండె పోటు రావడం తో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు..

We Loose Our Prominent Comedian With Heart Attack--We Loose Our Prominent Comedian With Heart Attack-

దీనితో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.67 ఏళ్ల క్రేజీ మోహన్ హాస్య నటుడిగా పలు చిత్రాల్లో నటించారు.ఆయన నటుడి గానే కాకుండా స్క్రీన్ ప్లే రచయితగా,నాటక కళాకారుడి గా కూడా మంచి గుర్తింపు ఉంది.అయితే ఉన్నట్టుండి ఆయనకు ఈ రోజు ఉదయం గుండె పోటు రావడం తో హుటాహుటిన కావేరి ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్నీ సినీ నటుడు సిద్దార్ధ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.వడివేలు,వివేక్ వంటి హాస్యనటులు రాకముందే ఒక దశకం లో క్రేజీ మోహన్ కోలీవుడ్ లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన మరణ వార్త తో కోలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆయన మృతి కోలీవుడ్ కు తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.