మాకు తమన్ వద్దు... మహేష్ ఫ్యాన్స్ షాకింగ్ డిమాండ్... అసలు ఏమైందంటే?

ఈ మధ్యకాలంలో అభిమానులు సోషల్ మీడియాలో తమకు నచ్చని సెలబ్రిటీల గురించి నచ్చని సినిమాల గురించి పెద్ద ఎత్తున హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమన్ మాకొద్దు అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

 We Dont Want Taman Mahesh Fans Shocking Demand What Happened, Taman, Mahesh Fans-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉంటూ అద్భుతమైన బిజిఎం లను ఇస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Balakrishna, Mahesh Fans, Ssmb, Taman-Movie

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం తమన్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాకి కూడా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఇకపోతే అద్భుతమైన మ్యూజిక్ అందించినప్పటికీ ఈయన తరచూ కాపీ వివాదాలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Balakrishna, Mahesh Fans, Ssmb, Taman-Movie

ఇలా కాపీ ఇష్యూ ద్వారా తరచు వార్తలు నిలిచే మా హీరో సినిమాకి తమన్ వద్దు అంటూ రిమూవ్ తమన్ SSMB 28 అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.ఇలా మహేష్ బాబు అభిమానులు తమన్ గురించి సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ చేయడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.అయితే తన గురించి ఇలాంటి ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ తమన్ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube