మనలో అజ్ఞానం ఉందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం: ఆనంద్ మహీంద్రా

భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.ఆయన తన వ్యాపార సంబంధిత విషయాలతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు.

 We Completely Forget That We Have Ignorance Says Anand Mahindra-TeluguStop.com

అలాగే వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోలను పోస్ట్ చేసి తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు.అలాగే లోకల్ టాలెంటెడ్ వ్యక్తులను తెగ ప్రశంసిస్తుంటారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సోషల్ మీడియాలో ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటూ తరచూ వార్తల్లో ఎక్కుతుంటారు.సోషల్ మీడియాలో ఆయనకు ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు.

 We Completely Forget That We Have Ignorance Says Anand Mahindra-మనలో అజ్ఞానం ఉందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం: ఆనంద్ మహీంద్రా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ రోజు శివరాత్రి పండుగ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అద్భుతమైన పోస్ట్ ని షేర్ చేశారు.ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

అంధకారాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలేందుకు మనమందరం మహాశివరాత్రి జరుపుకుంటాం.మనల్ని చుట్టేస్తున్న అంధకారం తొలగిపోవాలని మనం దేవున్ని పూజిస్తాం.

మనలోనే అజ్ఞానం, చీకటి కూడా ఉందన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం.ఎక్కడ వెతకాలో తెలిస్తే మనకి వెలుగు కనిపిస్తుంది.

హర హర మహాదేవ,” అని ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్న ఆనంద్ మహేంద్ర తమ మహేంద్ర గ్రూప్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమమైన కార్లను తయారు చేస్తున్నారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు విలాసవంతమైన జీవనశైలి ని కొనసాగించడం ఆనంద్ మహీంద్రా లోని ప్రత్యేకత.సోషల్ మీడియా ద్వారా ప్రజలందరినీ ఆలోచింపజేసే విధంగా ఆయన పోస్టులు పెడుతుంటారు.

ఇటీవల ముగ్గురు ఆఫ్రికన్ కుర్రాళ్ళకు చెందిన ఒక ఫోటో పోస్ట్ చేసి “ఫుడ్ ఫర్ థాట్” అంటూ అన్నిటినీ ఒక్కరే అత్యాశతో లాగేసుకోకూడదని.అందరూ సమంగా పంచుకుంటేనే అందరూ సంతోషంగా ఉండగలరు అని చెప్పుకొచ్చారు.

ఆ పోస్ట్ కూడా తెగ వైరల్ అయ్యింది.

#Special #Anand Mahindra #Social Medial #Viral #Sivarathri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు