ఫేస్ బుక్ లో అమ్మాయిల రిక్వస్ట్ లు యాక్సెప్ట్ చెయ్యకండి

అమ్మాయిల రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయవద్దని సరిహద్దుల్లో పనిచేస్తున్న అధికారులు, జవాన్లకు ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ కృష్ణ చౌదరి ఆదేశాలు జారీ చేశారు.పాకిస్తాన్, చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కొన్ని యాప్ ల ద్వారా మొబైల్ లోని సమాచారాన్ని తస్కరించాలని ప్రయత్నిస్తున్నారట.

 Dangerous To Accept Friend Requests From Girls-TeluguStop.com

ముఖ్యంగా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.గూగుల్ ప్లే స్టోర్ లోని వీచాట్(WeChat), స్మెష్(Smesh), లైన్(Line)వంటి యాప్లను అధికారులు, జవాన్లు వాడకూడదని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.

జవాన్లు వాడే స్మార్ట్ ఫోన్ల నుంచే విదేశాలకు చెందిన గూఢచార సంస్థలు ఆన్ లైన్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించగలిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఈ యాప్ ల ద్వారా ఎదురయ్యే దారుణమైన పరిణామాల గురించి తెలియని వారు ఇంకా వీటిని వాడుతున్నారని, ఏమౌతుందిలే అని వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని కృష్ణ చౌదరి హెచ్చరించారు.

పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలకు చెందిన హ్యాకర్లు కూడా భారత రహస్య సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.వీరు ముఖ్యంగా జవాన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ ల తో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు.యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేయడానికి మరో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు.

అనంతరం సదరు యాప్ ఇన్ స్టాల్ అవ్వగానే వారు మొబైల్ లోని కీలక సమాచారాన్ని(కాంటాక్ట్స్, మెసేజ్ లు, వీడియోలు, జీపీఎస్ లొకేషన్) హ్యాక్ చేయగలుగుతున్నారు.అందుకే ఆర్మీ అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube