మ‌నం ఒక్క క్ష‌ణం అలా ఉండ‌లేం... గ‌బ్బిలాలు నిత్యం త‌ల‌కిందులుగా ఎందుకు వేలాడుతుంటాయో తెలుసా?

గబ్బిలాల గురించి మాట్లాడినప్పుడల్లా గుర్తుకు వచ్చేది అవి త‌ల‌కిందులుగా వేలాడటం.అవి ఎందుకు అలా తలక్రిందులుగా వేలాడుతున్నాయి? అనే ప్రశ్న ఈనాటికే మీ మదిలో వచ్చి ఉండాలి.వాస్తవానికి, గబ్బిలం యొక్క కండరాలు రివర్స్‌లో పనిచేస్తాయి.గబ్బిలాల వెనుక భాగం మరియు పాదాలు కండరాలకు రివ‌ర్స్‌లో పని చేస్తాయి.దాని మోకాళ్లు వీపులా ఉంటాయి.దీనితో పాటు అవి విశ్రాంతి తీసుకున్నప్పుడు దాని ప్రత్యేకమైన కండరాలు కాలి వేళ్ళను పట్టుకుంటాయి.

 We Can't Stay Like That For A Single Moment Do You Know Why Bats Always Hang U-TeluguStop.com

ఈ కార‌ణంగా అవి తలక్రిందులుగా వేలాడుతున్నప్పుడు కూడా విశ్రాంతిగా ఉంటాయి.గురుత్వాకర్షణ శక్తి కారణంగా అవి వేలాడుతూ ఉంటాయి.

దీనివ‌ల‌న‌ వాటికి ఎటువంటి సమస్య ఎదుర‌వ‌దు.మ‌నిషిని తలక్రిందులుగా వేలాడదీసినప్పుడు, అతని శ‌రీరంలోని రక్తం తలలోకి చేరుతుంది.దీంతో ఇబ్బంది ఎదుర‌వుతుంది.కానీ గబ్బిలాల‌లోని రక్తం త‌క్కువ మోతాదులో ఉన్న కారణంగా, అవి తలక్రిందులుగా ఉన్నా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్ప‌డ‌దు.

నేషనల్ జియోగ్రాఫిక్ రిపోర్టు ప్ర‌కారం గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి.ఫ‌లితంగా వాటికి గురుత్వాకర్షణశ‌క్తి తోను, రక్త ప్రసరణల కార‌ణంగా పెద్దగా సమస్యలు ఉండవు.

ఈ కారణంగానే గబ్బిలాలు తలక్రిందులుగా వేలాడ‌గ‌లుగుతాయి.గబ్బిలం చనిపోయిన తర్వాత కూడా అది తలక్రిందులుగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube