వైట్ హౌస్ ముందు భారత టెకీల నిరసన..!!!  

  • అమెరికాలో చట్టపరంగా ఉంటున్న హెచ్ -1 బీ బీసాదారులకి ప్రయోజనం చేకూరేలా ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు తీసుకురావాలని భారత ఎన్నారైలు ఆదివారం వైట్ హౌస్ ముందు ధర్నా నిర్వహించారు.

  • రిపబ్లిక్ హిందూ కొలిషన్(ఆర్‌హెచ్‌సీ) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

  • We Are Not Displacing American Jobs-Nri Telugu Nri News Updates

    We Are Not Displacing American Jobs

  • ఈ ధర్నాలో దాదాపు 300 మంది భారతీయులు పాల్గొని తమ నిరసనని ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.

  • తమ వల్ల అమెరికన్స్ ఉద్యోగాలకి ముప్పు ఉందని అనడం తగదని అన్నారు. అంతేకాదు టెకీలు ముఖ్యంగా మూడు అంశాలని ప్రధానంగా లేవనెత్తారు.

  • గ్రీన్ కార్డు పొందడానికి విదేశీయులకు శతాబ్దాలు పడుతోంది అలాకాకుండా హెచ్ 1-బీ వీసాదారులు వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్న ఒకటి నుంచి ఐదేళ్లలోగా వీసా వచ్చేలా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రీన్‌కార్డుల జారీలో విధిస్తున్న కంట్రీ క్యాప్‌లో చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.