తెలంగాణ అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.సీఎం జగన్ పోరాట ఫలితమే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్రకటన అని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యనించారు.ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను గత సీఎంలే అభివృద్ధి చేశారని వెల్లడించారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిందనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.