అన్నం తినగానే చేసే ఈ ఐదు పనులు వలన దరిద్రం మీ వెన్నంటే ఉంటుంది..అవేంటో తెలుసుకోండి..జాగ్రత్తపడండి.!

మన ఆకలి తీర్చే అన్నం దైవంతో సమానం.అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.

 We Are Doing Mager Mistakes After Taking Meals-TeluguStop.com

పొరపాటున అన్నం మెతుకులు కాలికింద పడినా వెంటనే మొక్కుతాం.అలాంటిది అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు మనకు దరిద్రాన్ని కలిగిస్తాయి.ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇకపై ఆ పొరపాట్లను చేయకుండా జాగ్రత్తపడండి…

అన్నం తిన్న తర్వాత చేసే అయిదు పొరపాట్లు…


· అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు… తిన్నతర్వాత పక్కకెల్లి చేతులు బయట కడగాలి తప్ప.కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది.

· చాలామంది తిన్నవెంటనే కంచం ముందు నుండి లేచే అలవాటు ఉండదు…తిన్న కంచం ముందు కూర్చుని ఇతరులతో మాట్లడడం లాంటివి చేస్తుంటారు.ఇది దరిద్రానికి సంకేతం.

కాబట్టి తిన్నవెంటనే కంచం ముందునుండి లేవాలి.

· తినడం పూర్తవగానే పళ్లల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు పెట్టో ,పుల్ల పెట్టే తీస్తుంటారు.

అలాకాకుండా నీటితో పుక్కిలించాలి.దాని వలన పళ్లల్లో ఇరుక్కున్న ఆహారం పోవడమే కాదు,,పిన్నీసులు,పుల్లలు పెడితే దంతాలకు కూడా నష్టం.

· నాలుగవ తప్పిదం ఏంటంటే చాలామంది అన్నం తినగానే ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు.ఇది పరమదరిద్రానికి హేతువు.ఒళ్లు విరుచుకోవడం లేదంటే తినగానే పడుకోవడం కూడా సరియైన పధ్దతి కాదు.

· భోజనం ముగించగానే చాలామంది చేతులు కడుక్కుని,తడి చేతుల్ని విదులుస్తారు.

అలా విదల్చడం చేయకూడాదు ఇది దరిద్రానికి కారణం.ఇకపై అన్నం తినగానే ఈ అయిదు పనులను చేయకండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube