కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారు పుచ్చ‌కాయ తింటే ఏం అవుతుందో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో కిడ్నీలో రాళ్లు ఉండ‌టం అనేది ఎక్కువ శాతం మందిలో కామ‌న్‌గా క‌నిపిస్తున్న స‌మ‌స్య‌.మూత్రపిండంలో లేదా మూత్ర నాళంలో లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాల కలయికతో ఈ రాళ్లు ఏర్ప‌డ‌తాయి.

 Watermelon Kidney Stones Latest News Health Tips Good Health-TeluguStop.com

ఈ రాళ్లు చిన్న‌విగా ఉంటే యూరిన్ ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి.కానీ, పెద్ద‌విగా ఉంటే మాత్రం ముప్ప తిప్ప‌లు పెడ‌తాయి.

అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే నీరసం, అలసట, ఒళ్లు నొప్పులు, యూరిన్ వెళ్లే స‌మ‌యంలో భ‌రించ‌లేనంత నొప్పి, త‌ర‌చూ జ్వ‌రం రావ‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

 Watermelon Kidney Stones Latest News Health Tips Good Health-కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారు పుచ్చ‌కాయ తింటే ఏం అవుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే కిడ్నీలో రాళ్లను ఎంత త్వ‌ర‌గా నివారించుకుంటే అంత మంచిది.

అయితే కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.అలాంటి వాటిలో పుచ్చ‌కాయ ఒక‌టి.

పుచ్చ‌కాయ‌లో ఎన్నో పోష‌కాలు నిండి ఉన్నాయి.కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐర‌న్‌, ప్రోటీన్‌, న్యాచుర‌ల్ షుగ‌ర్స్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు పుచ్చ‌కాయలో ఉంటాయి.

అందుకే పుచ్చ‌కాయ ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంద‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ప‌చ్చ‌కాయ‌ను స్వ‌చ్ఛ‌మైన తేనెలో క‌లిపి తీసుకోవాలి.ఒక వేళ తేనె లేకుంటే ప‌చ్చ‌కాయ‌నే డైరెక్ట్‌గా తీసుకోవ‌చ్చు.ఇలా ఎలా తిన్నా మూత్ర పిండాల్లో ఉండే రాళ్లు క‌రుగుతారు.

అలాగే ప‌చ్చ‌కాయ త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.అంతేకాదు, ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.ఒత్తిడి, త‌ల‌నొప్పి, కిళ్ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఇక మ‌ల‌బద్ధ‌కం స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు త‌ర‌చూ పుచ్చ‌కాయ తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

#Kidney Health #BenefitsOf #Health #Health Tips #Kidney Stones

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు