నగర ప్రజలకు వాటర్ సప్లై బోర్డ్ గమనిక.. రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదట.. !

వర్షాకాలంలో నీరు ఎక్కువై బాధపడ్ద నగర ప్రజలు, వేసవిలో నీటి ఎద్దడితో కష్టాలు అనుభవించక తప్పడం లేదు.ప్రభుత్వాల హమీలు కాగితాల వరకే పరిమితం అవుతున్నాయి.

 Tomorrow These Areas Will Not Get Water Supply Says Water Supply Board-TeluguStop.com

ఇక వేసవి వచ్చిందంటే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యలు చెప్పలేని విధంగా ఉన్నాయి.

ఇలా వాటర్ ఎప్పుడోస్తాయో తెలియని పరిస్థితి.

 Tomorrow These Areas Will Not Get Water Supply Says Water Supply Board-నగర ప్రజలకు వాటర్ సప్లై బోర్డ్ గమనిక.. రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదట.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటర్ వచ్చినప్పుడు బకెట్లలో, క్యాన్స్‌లో నింపుకుని పెట్టుకునే పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది.ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ప్రజలకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ అధికారులు ముఖ్య గమనిక అంటూ ఒక కబురు అందిస్తున్నారు.

అదేమంటే మార్చి 8న అంటే రేపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగ్గా ఉండదని వెల్లడించారు.

ముఖ్యంగా నాచారం, బోడుప్పల్, తార్నాక, లాలా పేట్, మారెడ్ పల్లి, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, అసిఫ్ నగర్, మాదాపూర్, షేక్ పేట, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ గడ్, నారాయణ గూడ లాంటి ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుందని అధికారులు తెలియచేస్తున్నారు.

ఇకపోతే నల్గొండ జిల్లాలోని కొండాపూర్, నర్సర్లపల్లి, గోడకొండ సబ్ స్టేషన్ల దగ్గర తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో ప్రతిపాదిత పవర్ షట్ డౌన్ అయిందని, అక్కడ మరమ్మతులు చేస్తున్న కారణంగా నగరంలో నీటి సరఫరా సమస్య ఏర్పడిందని వెల్లడిస్తున్నారు.అందుకనే నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

#City People #Power Shut Down #Repair Problem #Supply Board #Tomorrow

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు