నీటి ఎద్దడితో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏం నిర్ణయం తీసుకుందో తెలిస్తే నోరెళ్ల బెడతారు

మనిషి మనుగడకు గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం.గాలి లేకుంటే ఇప్పటికప్పుడు సమస్య వస్తుంది.

 Water Starved Chennai It Corridor Turns To Byop To Tackle Crisis-TeluguStop.com

కాని నీరు లేకుండా వెంటనే కాకున్నా కొన్ని గంటల తర్వాత లేదంటే కొన్ని రోజుల తర్వాత అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.నీటి ఎద్దడితో దేశంలోని కొన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రతి సారి మే మరియు జూన్‌లలో కొన్ని రాష్ట్రాలు నీటి సమస్యతో అల్లాడి పోవడం జరుగుతూనే ఉంది.అయితే ఈసారి గతంతో పోల్చితే చాలా ఎక్కువగా నీటి ఎద్దడి ఉంది.

కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు నీటి సమస్యతో అల్లాడి పోతున్నాయి.ఇప్పటికే కర్ణాటకలో పలు ప్రాంతాల్లో హై ఎలర్ట్‌ ప్రకటించడంతో పాటు నీటి పొదుపు చర్యలు చేపట్టారు.

ఇక తమిళనాడులోని చెన్నైలో కూడా పలు ఏరియాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది.నీటి సమస్య వల్ల కొన్ని కంపెనీలు కూడా మూత పడిపోయాయి.నీటి అవసరం పెద్దగా లేని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చెన్నైలోని నీటి ఎద్దడి సమస్య ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ నిర్ణయంను చాలా మంది అభినందిస్తున్నారు.

నీటి ఎద్దడితో ఒక ప్రముఖ సాఫ్ట�

చెన్నైకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వేలాది మంది ఉద్యోగం చేస్తూ ఉంటారు.వారందరు రెగ్యులర్‌ అవసరాల కోసం నీరు అవసరం అవుతుంది.అయితే అందుకు కూడా నీరు లేదు.ఆ కంపెనీకి నీరు అందించే బోరు నుండి చుక్క నీరు రాకపోవడంతో వేల రూపాయలు ఖర్చు చేసి బయట నుండి నీరు తెప్పించాల్సి వస్తుంది.

ప్రతి రోజు అంత ఖర్చు పెట్టడం ఎందుకని కంపెనీ వారు దాదాపు 60 శాతం ఎంప్లాయిస్‌ను ఇంటి నుండి వర్క్‌ చేయాల్సిందిగా ఆదేశించింది.ఆఫీస్‌కు తప్పనిసరి రావాల్సిన వారిని మాత్రమే రమ్మంటుంది.

జులై నెల వరకు ఇలాగే పరిస్థితి కొనసాగనుంది.ఈ నెలలో వర్షాలు వస్తే అప్పుడు నీటి సమస్య తీరనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube