కౌశిక్‌రెడ్డి ఆశ‌ల‌పై నీళ్లు.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి గ‌వ‌ర్న‌ర్ బ్రేక్‌.. ఏం జ‌రుగుతోంది..?

తానొక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి త‌ల‌చింద‌నే సామెత అంద‌రికీ గుర్తు ఉంటుంది.అయితే ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు ఓ నేత విష‌యంలో వ‌చ్చింది.

 Water On Kaushik Reddy's Hopes  Governor's Break For What Is Happening Kaushik R-TeluguStop.com

ఎన్నో ఆశ‌ల‌తో పార్టీ మారినా కూడా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం పెద్ద‌గా మార్పు చెంద‌ట్లేదు.హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధానంగా వినిపించిన పేరు కౌశిక్‌రెడ్డి.

ఈయ‌న కాంగ్రెస్ పార్టీ లో ఉన్న‌ప్పుడు ఆయ‌నే అభ్య‌ర్థి అన్న రేంజ్‌లో ప్ర‌చారం సాగింది.అయితే ఆయ‌న అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి సెటిల్ అయ్యాడు.

అయితే మొద‌ట్లో ఈయ‌న‌కే పార్టీ టికెట్ ఇస్తార‌ని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని చెప్పారు కేసీఆర్‌.

కానీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళ సై నీళ్లు చ‌ల్లారు.టీఆర్ఎస్ లో చేరిన మొద‌టి నుంచి ఆయన వాస్త‌వానికి హుజూరాబాద్ టికెట్ ఆశించారు.

కానీ అది ద‌క్క‌క‌పోవ‌డంతో క‌నీసం కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.ఇక ఇది అయినా ద‌క్కుతుంద‌ని కౌశిక్‌రెడ్డి ఎంతో ఆశ‌గా ఎదురు చూస్.

తున్నారు.అయితే ఇక్క‌డే అస‌లు చిక్కు వచ్చి ప‌డింది.

అదేంటంటే సేవా సాంస్కృతిక రంగం కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు.దీనికి కేసీఆర్ కేబినెట్ కూడా ఆమోదించింది.

Telugu Cm Kcr, Congress, Huzurabad, Kaushik Reddy, Tg Tamilsy, Tg, Ts-Telugu Pol

దీంతో ఇక కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఖాయ అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు.కానీ ఇప్పుడు అనుకున్న‌ది జ‌ర‌గ‌కుండా ఈ ఫైల్ కు ఆమోద ముద్ర వేయాల్సిన గవర్నర్ తమిళి సై బ్రేక్ వేసేశారు.ఈ ఫైలుపై సంచలన కామెంట్లు చేస్తూ నిన్న అన‌గా బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.అస‌లు కౌశిక్ రెడ్డికి సేవారంగం కోటాలో సిఫార్సు చేశార‌ని, అస‌లు ఆయ‌న ఏ ర‌క‌మైన సేవ‌లు చేశారో స్ట‌డీ చేసిన త‌ర్వాతే ఆమోద ముద్ర వేస్తానంటూ తెలిపారు.

ఇంకో అడుగు ముందుకు అస‌లు ఆ వ్య‌క్తికి సంబంధం లేని రంగంలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం సరైంది కాదని చెప్ప‌డం ఇప్పుడు రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతోంది.చూడాలి మ‌రి ఆమె ఏ నిర్ణ‌యం తీసుకుంటారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube