దేశంలోనే తొలిసారిగా గాలిలోంచి నీరు..లీటరు..రూ.5/- మాత్రమే...!!!

దేశంలో మొదటి సారిగా గాలి నుంచీ నీటిని తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు సికింద్రాబాద్ రైల్వే శాఖ.ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశామని తెలిపారు.

 Water From Air Is First Time In India-TeluguStop.com

అంతేకాదు సహజంగా మనం త్రాగే నీటికంటే కూడా ఇది ఎంతో స్వచ్చంగా ఉంటుందని తెలిపారు.తమ ప్రయాణికులకి స్వచ్చమైన నీటిని అందించాలనేది తమ నిర్ణయమని అందుకే ఈ విధానాన్ని పరిశీలించామని ఇది ఎంతో మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు.

అసలు గాలి నుంచీ నీటిని ఎలా బయటకి తీస్తారు.ఇదే సాధ్యపడుతుంది అంటే.గాలిలోని నీటి అణువులని వడిసి పట్టి ఈ నీటిని తీస్తున్నారు.వామ్మో అనుకుంటున్నారా టెక్నాలజీ మారుతున్న కొద్దీ అసంభవం అనుకున్నవి కూడా జరిగిపోతున్నాయి.

సరే ఈ నీటిని ఒడిసి పట్టడానికి ఏమి చేస్తున్నారంటే.గాలి నుంచే నీటిని తీసే పరికరం ఆట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్ ని ఉపయోగించి తీస్తారు.

ఈ యంత్రానికి మెఘ్ దూత్ అని పేరుని కూడా పెట్టారు.

Telugu Telugu Nri Ups, Air, Air Time India-

ఈ యంత్రం గాలి నుంచీ అంచెలంచలుగా నీటిని సేకరిస్తుంది.ఈ నీటిని యంత్రంలోకి పంపుతారు.అక్కడ ఈ నీరు వాడబోయబడుతుంది.

అదేవిధంగా గాలిలో ఉండే తేమలోని కాలుష్యాని అక్కడే శుద్ది చేస్తారు.ఆ తరువాత శుద్ది చేయబడిన గాలి చల్లని గదిలోకి వెళ్లి అక్కడ ఘన పదార్ధంగా మారుతుంది.

ఈ గట్టిపడిన గాలి నీటి చుక్కలుగా పడుతూ నీటిని సేకరిస్తుంది.ఈ విధంగా వచ్చిన నీటిలో ఖనిజ లవణాలు కలపడంతో అది మంచినీరుగా మారుతుంది.

ఇలా ఈ యంత్రం 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది.లీటర్ బాటిల్ నీటిని రూ.8 కి అమ్ముతుండగా, బాటిల్ లేని నీటిని రూ.5 కే అముతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube