సర్వే : అతిగా టీవీ సీరియల్స్‌ చూసే వారు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలు ఏంటో తెలిస్తే భయంతో వణికి పోతారు

గత దశాబ్ద కాలంగా టీవీ సీరియల్స్‌ మరీ దారుణంగా పెరిగి పోయాయి.అంతకు ముందు కూడా సీరియల్స్‌ ఉన్నా కూడా కాస్త పద్దతిగా ఉండేవి.

 Watching Tv Seriels Not To Good For Human-TeluguStop.com

కాని ఈమద్య కాలంలో వచ్చిన సీరియల్స్‌ కక్షలు పెంచేవిగా, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకునేవిగా ఏకంగా చంపుకునేవిగా కూడా ఉంటున్నాయి.దాంతో ఆడవారు ఆ సీరియల్స్‌ వల్ల చాలా ప్రభావం అవుతున్నారని తాజాగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

ఆ సీరియల్స్‌ లో ఆడవారిని ఫాలో అవుతున్న ఆడవారి సంఖ్య రోజు రోజుకు చాలా పెరుగుతుందట.

మొదటగా సీరియల్స్‌లో నటించే వారి కట్టు బొట్టును స్త్రీలు పాటిస్తున్నారు.

ఆ తర్వాత వారి ఆలోచన విధానంను కూడా తమకు అన్వయించుకుని వారిలా ప్రవర్తిస్తున్నారు.ఏదైనా సీరియల్‌ లోని ఒక పాత్రను తమ అభిమాన పాత్రగా అనుకోవడం లేదంటే, ఆ పాత్ర తన నిజ జీవితంకు దగ్గరగా ఉందనుకోవడం జరుగుతుంది.

అలా ఏ పాత్రతో అయితే తమను పోల్చుకుంటున్నారో ఆ పాత్ర వ్యవహరించిన తీరును బట్టి వీరు కూడా వ్యవహరిస్తున్నారంటూ సర్వేలో భయంకర విషయాలు వెళ్లడయ్యాయి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీరియల్స్‌ వల్ల భవిష్యత్తులో జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు.

సర్వే : అతిగా టీవీ సీరియల్స్‌ �

ఆడవారు భవిష్యత్తులో తమకు నచ్చని వారిని హత్య చేసేందుకు కూడా సిద్దం అయ్యే అవకాశం ఉంది.ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్‌కు బానిసైతే నెగటివ్‌ పాత్రలు చేసే వారి మాదిరిగా సామాన్యులు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.సీరియల్స్‌లోని హీరోయిన్‌ను ఫాలో అయితే పర్వాలేదు కాని విలన్‌ వేషాలు వేసే నటిని ఫాలో అయితేనే అసలు సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు.

సర్వే : అతిగా టీవీ సీరియల్స్‌ �

మహిళలను సీరియల్స్‌ చూడకుండా ఆపడం సాధ్యం అయ్యే పని కాదు.అలాగే సీరియల్స్‌లో హింస లేకుండా చేయడం కూడా సాధ్యం అయ్యే విషయం కాదు.అందుకే సీరియల్స్‌ చూస్తున్న ఆడవారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

వారి ప్రవర్తనలో మార్పు వస్తే అప్పుడు ఖచ్చితంగా వారిని కౌన్సిలింగ్‌ కోసం సైక్రియార్టిస్టు వద్దకు తీసుకు వెళ్లాల్సిందే.ఇంకా అజాగ్రత్త చేస్తే మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube