పిచ్చి ప్రయోగం చేశాడు... తగిన శాస్తి జరిగింది!

సాధారణంగా మన ఇంట్లో తరచూ ఒకే రకమైన భోజనం తింటూ బోర్ కొడుతుంది.అలాంటప్పుడు ఏదైనా కొత్తగా, వెరైటీ గా చేసుకోని తినాలని కొందరు ప్రయత్నిస్తుంటారు.

 Korean Man Filled Melted Cheese Into A Chocolate Fountain Machine, Korean Man,me-TeluguStop.com

దానికోసం యూట్యూబ్ లో సెర్చ్ చేసి, మనకు రాకపోయినా కొన్ని వంటలు తయారు చేయడానికి ప్రయత్నిస్తారు.కానీ కొన్ని సార్లు మాత్రమే అవి సక్సెస్ అవుతాయి.

మరి కొన్నిసార్లు మాత్రం మొత్తం చెడిపోయి కేవలం నిరాశ మాత్రమే మిగులుతుంది.తాజాగా అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోలో కొరియాకు చెందిన వ్యక్తి తనకిష్టమైన ఆహారం తయారు చేసుకొని తినాలని భావించాడు,తను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా, తన ముందున్న ఒక ఫౌంటెన్ జారుని తీసుకొని అందులో చాక్లెట్ ఫ్లేవర్ ను ఉంచి, తర్వాత అందులోకి కరిగి ఉన్న చీజ్ వేసాడు.తర్వాత ఫౌంటైన్ మిషన్ ఆన్ చేయగానే మొదటిగా సాధారణంగా తిరిగిన ఆ మిషన్, తర్వాత వేగం పెరిగే కొద్దీ ఆ చీజ్ మొత్తం గిరగిరా తిరుగుతూ అతని మొహానికి, ఎగిరి అంతా బయట పడింది.

ఎంతో వెరైటీగా తినాలి అనుకున్న అతని ఆశలు, అతని కష్టం మొత్తం వృధాగా మారిపోయిందని ఎంతో బాధపడ్డాడు.చేసేదేమీలేక కింద పడ్డ చీజ్ తీసుకుని పక్కనే ఉన్న రోల్స్ లో పెట్టుకుని తిన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి,ఎంతో హాస్యాస్పదంగా ఉంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే దాని ఫలితం ఇలానే ఉంటుందని….

తెలియని వాటి జోలికి వెళ్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ వీడియోకి ఆరు మిలియన్ వ్యూస్ రావడం ఎంతో విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube