వైరల్ వీడియో: ఏనుగుపై యోగ చేస్తూ కిందపడ్డ బాబా రామ్ దేవ్!

బాబా రామ్ దేవ్ గా పిలవబడే రామ్ కిసాన్ యాదవ్ ఇక యోగా గురువు అన్న సంగతి తెలిసినదే.2002వ సంవత్సరం నుంచి యోగా శిబిరాలను నిర్వహిస్తున్నారు.అంతేకాకుండా ప్రేక్షకుల కోసం టీవీ కార్యక్రమాల ద్వారా యోగ తరగతులను కూడా నిర్వహిస్తూ ఉంటారు.ప్రముఖ ఆయుర్వేదిక్ పతాంజలి వస్తువుల రామ్ దేవ్ బాబానే స్థాపించారు.ఈ పతాంజలి వస్తువులు మనదేశం లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.

 Baba Ramdev Fell While Doing Yoga On Elephant, Baba Ramdev , Yoga, Yoga Asanas O-TeluguStop.com

ప్రస్తుతం యోగా గురు రామ్ దేవ్ బాబా ఏనుగు పై యోగాసన చేస్తూ జారి కింద పడ్డ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియో లో రామదేవ్ బాబా మధురాలోని గురు శరణన్ ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆశ్రమంలోని వారికి ఏనుగు పై ఆసనం నేర్పించే సమయంలో ఏనుగు కొద్దిగా కదలడంతో రామ్ దేవ్ బాబా బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా జారి కింద పడ్డారు.

కిందపడ్డ బాబాకి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.కింద పడ్డ బాబా నవ్వుతూ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇరవై రెండు సెకండ్ల పాటు సాగే ఈ వీడియో లో బాబా కింద పడ్డ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలో నే ఎన్నో వేల వ్యూస్ సంపాదించింది.ఈ ఘటన సోమవారం గురుశరణాన్ ఆశ్రమంలో చోటుచేసుకుంది.అయితే అక్కడకు సాధువులు ఒక్కసారిగా గుంపులుగా రావడంతో ఏనుగు లో కదలికలు రావడం వల్ల రామ్ దేవ్ బాబా ఒక్కసారిగా కింద పడ్డారని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.కానీ బాబాకి ఏమీ కాకపోవడం ఎంతో ఆనందించాల్సిన విషయం అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube