అభిమానులకు సందేశం ఇచ్చిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్  

Wasim Akram Giving Suggestion To Cricket Fans-india,pakistan,sunday Match,wasim Akram,world Cup

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్‌. క్రికెట్ అభిమానుల‌కు సందేశం ఇచ్చాడు..

అభిమానులకు సందేశం ఇచ్చిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్-Wasim Akram Giving Suggestion To Cricket Fans

క్రికెట్ అభిమానులు కూల్‌గా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలన్నాడు. ఆదివారం భార‌త్‌, పాక్ మ‌ధ్య హై టెన్ష‌న్ మ్యాచ్‌ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది యుద్ధం క‌న్నా ఎక్కువేమీ కాద‌న్నారు.

రెండు దేశాలు ఆడుతున్నాయంటే. సుమారు వంద కోట్ల మంది ఆ మ్యాచ్‌ను తిల‌కిస్తున్న‌ట్లే అని, కానీ అభిమానులు కూల్‌గా ఆ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాల‌న్నారు.

ఒక టీమ్ గెలుస్తుంది, ఒక టీమ్ ఓడిపోతుంది, హుందాగా ఉండండి, దీన్నో యుద్ధంలా చూడ‌కూడ‌ద‌న్నారు. ఈ మ్యాచ్‌ను యుద్ధంలా చూసే వాళ్లు నిజ‌మైన క్రికెట్ అభిమానులు కాద‌ని అక్ర‌మ్ అన్నారు. రెండు దేశాలు ఆరు సార్లు ప్రపంచ‌క‌ప్‌లో పోటీప‌డగా, ఆరుసార్లూ ఇండియానే గెలిచింది అని గుర్తి చేసిన వసీం, కోహ్లీ సేన‌ బ్యాటింగ్‌, బౌలింగ్ లైన‌ప్ పాక్ క‌న్నా బ‌లంగా ఉంద‌ని అభిప్రాయపడ్డాడు.

న్నారు. ఒత్తిడిని స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న జ‌ట్టే విజ‌యాన్ని సాధిస్తుంద‌ని వసీం ధీమా వ్యక్తం చేశాడు.