అమెరికాలో రాకాసి కందిరీగలు.. ప్రాణాలే పోతాయంట..?  

Washington officials find first ever murder honest nest in america , America, Asian giant hornet nest, Blaine, murder honest nest - Telugu America, Asian Giant Hornet Nest, Blaine, Honest Nest, Murder Honest Nest, Murder Hornet, Washing Ton Officials, Washington Officials Find First Ever Murder Honest Nest In America

2020 సంవత్సరంలో ప్రపంచ దేశాల్లో ప్రజలు వైరస్ ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల, ఇతర జీవుల వల్ల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది.కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

TeluguStop.com - Washington Officials Find First Ever Munder Honest Nest In America

ఈ వ్యాధుల వల్ల, కొన్ని జీవుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.

తాజాగా అగ్రరాజ్యాన్ని రాకాసి కందిరీగలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

TeluguStop.com - అమెరికాలో రాకాసి కందిరీగలు.. ప్రాణాలే పోతాయంట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కందిరీగలు ప్రాణాలు తీయడం వినడానికి వింతగానే ఉన్నప్పటికీ గతంలో కందిరీగల వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయి.

అయితే ఈ రాకాసి కందిరీగలు ఇతర దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసినా అమెరికాలో మాత్రం తొలిసారి దర్శనమిచ్చాయి.అమెరికాలోని వాషింగ్టన్‌లోని బ్లైనే ప్రాంతంలో ఒక వ్యక్తికి పొలంలో వింత ఆకారంలో ఉన్న కందిరీగలు కనిపించాయి.

ఆ వ్యక్తి వాటి గురించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు.

అధికారులు ఆ కందిరీగలను చూసి అవాక్కయ్యారు.

తేనెటీగలను, మనుషులను సునాయాసంగా చంపేయగల కందిరీగలు కావడంతో అవి నివశించే గూడును జాగ్రత్తగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.ఆ కందిరీగల వల్ల తేనెటీగల జాతికే ప్రమాదం వాటిల్లేదని.150 నుంచి 200 రాకాసి కందిరీగలు ఉన్నట్టు తాము గుర్తించామని అధికారులు చెబుతున్నారు.రాకాసి కందిరీగలు అమెరికాకు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అలాంటి రాకాసి కందిరీగలు ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయేమో అనే అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాలను సైతం పరిశీలిస్తున్నారు.ఈ రాకాసి కందిరీగలు మనుషులకు కుడితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని.

కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతాయని అధికారులు చెబుతున్నారు.రాకాసి కందిరీగలకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అధికారులు అలాంటి కందిరీగలు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని.ఆ కందిరీగలు ప్రాణాలకే ప్రమాదమని సూచిస్తున్నారు.

#AsianGiant #WashingTon #Murder Hornet #Honest Nest #Blaine

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Washington Officials Find First Ever Munder Honest Nest In America Related Telugu News,Photos/Pics,Images..