వాషింగ్టన్ లో లాక్ డౌన్..కరోనా ఎఫెక్ట్ కాదు...!!!

అమెరికా నూతన అధ్యక్షుడిగా బిడెన్ ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అయితే అమెరికా క్యాపిటల్ పై జరిగిన దాడి ఘటన తరువాత తదుపరి పరిణామాలు కూడా ఈ తరహాలోనే ఉండబోతాయని ఇంటిలిజెన్స్ హెచ్చరించడంతో అత్యంత కట్టుదిట్టమైన బద్రతను ఏర్పాటు చేశారు.

 Washington Goes On Lockdown Ahead Of Joe Biden Inauguration,joe Biden Inaugurati-TeluguStop.com

మరో సారి అల్లర్లు జరుగుతాయని అంచనా వేసిన నేపధ్యంలో ప్రభుత్వం దాదాపు 20వేల మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలని భావిస్తోంది.ఇప్పటికే సుమారు 10వేల మందితో కట్టుదిట్టమైన బద్రతా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.ఇదిలాఉంటే
వాషింగ్టన్ లోని హోటల్స్, విమానాశ్రయ సంస్థలు, వ్యాపారల వద్ద కట్టుదిట్టమైన బద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రముఖ ఎయిర్ లైన్స్ డేటా కూడా తమ ప్రయాణీకులపై ఆంక్షలు విధించింది.

దాంతో ఇప్పుడు ఆ నగరంలో మొత్తం లాక్ డౌన్ పరిస్థితులు కనబడుతున్నాయి.క్యాపిటల్ భవనంపై దాడి తరువాత బద్రతలు భారీగా పెంచాలని యోచిస్తోంది ప్రభుత్వం.

ఇప్పటికే క్యాపిటల్ పై దారుల తరువా ఎంతో అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రభుత్వం ఈ బద్రత ఏర్పాట్లు విజయవంతం అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇప్పటికే క్యాపిటల్ భవనం వద్ద దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అక్కడ మూడంచెల బధ్రతను ఏర్పాటు చేశారు.అలాగే సుప్రీంకోర్టు , లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనాల దగ్గర కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు.

భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రతీ చోట వ్యాపార సంస్థలు షాపులు మూసివేయాలని ప్రకటించారు.ఆ దిశగా వెళ్ళే రోడ్డు మార్గాలు, బస్సు మార్గాలను పూర్తిగా మూసేశారు.

అంతేకాదు పర్యాటకులను కూడా అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.నేషనల్ పార్క్ లు, ఆహ్లాదకరమైన ప్రాంతాలు అన్నీ లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube