వైసీపీకి అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ ఛాన్స్ ఇచ్చారా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఏపీ మంత్రులు ఒక్క‌సారిగా మాట‌ల దాడి మొద‌లు పెట్టారు.ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ టార్గెట్ చేసిన వైసీపీ నేత‌లు.

 Was Ycp Given An Unnecessary Chance Ycp Pawan Kalyanap News-TeluguStop.com

ఒక్క‌సారిగా ప‌వ‌న్ పై త‌మ క‌సి తీర్చేసుకున్నారు.మంత్రులు పేర్ని నాని, బోత్స స‌త్య‌నారాయ‌ణ‌, అనిల్ కుమార్ యాద‌వ్ త‌మ మాట‌ల‌తో ఓ రేంజ్లో తిట్టిపోశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన అవ‌కాశాన్ని మంత్రులు ఇలా వినియోగించుకున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.ప‌వ‌న్ ఈ మ‌ధ్య ఎందుకో జోష్‌లో ఉన్నారు.గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు.ఆయ‌న కూడా పార్టీకి దూరంగా ఉన్నారు అంతేకాదు జ‌న‌సేన పార్టీలోని సీనియ‌ర్ కూడా అంటిముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 Was Ycp Given An Unnecessary Chance Ycp Pawan Kalyanap News-వైసీపీకి అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ ఛాన్స్ ఇచ్చారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Anil Kumar Yadav, Ap Ministers, Ap News, Ap Politics, Jagan And Ycp Ministers, Janasena, Kodali Nani, Pawan Kalyan, Perni Nani, Ysrcp-Telugu Political News

అయితే ఇటివ‌ల ఏపీలో జ‌రిగిన పంచాయ‌తీ, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మంచి ఫ‌లితాలు సాధించింది.దీంతో ప‌వ‌న్ లో కొంత జోష్ పెరిగింది.దీంతో జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశం మ‌రింత ఉండ‌డంతో వైసీపీ నేత‌లు ప‌వ‌న్ టార్గెట్ చేసి మాట‌ల యుద్ధం మొద‌లు పెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇటివ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌ల‌కు చాన్స్ ఇచ్చిన‌ట్టు అయింది.

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఇలా ఏకి పారేస్తే.ఆయ‌న‌కు మ‌ద్దుతుగా ఒక్క‌రూ మాట్లాలేదు.

వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ ఇమేజ్ కూడా డ్యామేజీ అయింది.జ‌న‌సేనాలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు కూడా మంత్ర‌లు చేసిన దాడిపై ఎలాంటి స్పంద‌న లేక‌పోడంతో విడ్డూరంగా ఉంది.

ప‌వ‌న్‌ను మంత్రులు ఎన్ని మాట‌లు అన్నా.జ‌న‌సేన నుంచి కానీ, సీని ప‌రిశ్ర‌మ నుంచి ఎవ‌రూ స్పందించ‌డం లేదు.

దీంతో ఎప్ప‌టి నుంచో వేచి చూస్తున్న వైసీపీకి మంచి అవ‌కాశం దొరిక్కింది.ప‌వ‌న్ క‌ల్యాణ్ తానే వైసీపీ నేత‌ల‌కు అవకాశం క‌ల్పించార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

#Ysrcp #JaganYCP #Kodali Nani #Pawan Kalyan #Perni Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు