తెలుగులో ఎన్టీఆర్ ,నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు లాంటివారు అప్పట్లో వరుసగా సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళు మల్టీ స్టారర్ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చారు.ఇక ఈ ట్రెండ్ అనేది వాళ్ళతోనే ముగిసిపోయింది.
ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో మళ్ళీ మల్టీ స్టార్ లా హవా నడుస్తున్నప్పటికీ 2000 సంవత్సరం నుంచి 2010 వరకు మాత్రం అసలు ఒక్క మల్టీ స్టారర్ సినిమా కూడా రాలేదు.దీనివల్ల హీరోల అభిమానుల్లో మా హీరోనే గొప్ప అనే ఒక భావన అయితే ఏర్పడుతుంది.
ఇక హీరోలందరూ కలిసి నటిస్తే అప్పుడు హీరోలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి అభిమానులు కూడా కలిసి ఉండాలి అనే ఒక భావనతో ఉంటారు.
కానీ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ , వెంకటేష్ ( Chiranjeevi, Nagarjuna, Balakrishna, Venkatesh ) లాంటి హీరోలు కలిసి సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు అభిమానుల మధ్య తగాదాలు వస్తూ ఉండేవి.ఇక ఇది ఇలా ఉంటే మల్టీ స్టారర్ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రి లో రావాలి అనే ఉద్దేశ్యం తో దిల్ రాజు( Dil Raju ) లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సాహసం చేసే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా( Seethammavakitlo Sirimalle Chettu movie ) తీశాడు.ఇక ఈ సినిమాలో వెంకటేష్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి నటించారు.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి నటన పరంగా మంచి క్రేజ్ అయితే వచ్చింది.కానీ వెంకటేష్ కి మాత్రం అనుకున్నంత క్రేజ్ రాలేదు.
దానికి కారణం ఏంటి అంటే వెంకటేష్ తో కొన్ని సీన్లు చిత్రీకరించినప్పటికీ అవి ఫైనల్ వర్షన్ కి వచ్చేసరికి ఎడిటింగ్ రూమ్ లో ఎడిట్ చేసినట్టుగా తెలుస్తుంది.అయితే లెంత్ ఎక్కువగా ఉండటం వల్లే ఆ సీన్స్ ని కట్ చేసినట్టుగా అప్పట్లో సినిమా యూనిట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా వెంకటేష్ కి అన్యాయం జరిగిందనే చెప్పాలి…
.