విలన్‌ మరణం సహజం కాదు

తమిళం మరియు తెలుగులో విలన్‌గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కళాభవన్‌ మణి ఇటీవలే మరణించిన విషయం తెల్సిందే.ఈయన మరణం తెలుగుతో పాటు తమిళ సినీ వర్గాల వారిని తీవ్ర దిగ్బ్రాంతిని కలుగ జేసింది.

 Was Kalabhavan Mani Murdered..?-TeluguStop.com

ఒక మంచి నటుడిని కోల్పోయాం అని, తక్కువ వయస్సులో కళాభవన్‌ మణి ఇలా మరణించడం ఆవేదన కలిగించిందని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.అయితే ఈయన మరణం వెనుక ఏవో రహస్యాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కళాభవన్‌ మణి కేరళలో చనిపోయిన విషయం తెల్సిందే.ఈయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు.

ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతు మరణించాడు.పోస్ట్‌మార్టం తర్వాత కళాభవన్‌ మణిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఈయన మృతికి ముందు ఎవరిని కలిశారు అనే విషయంపై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

అలాగే ఈయన ఫోన్‌ కాల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube