ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి హెచ్చరిక...

రోజు రోజుకు నగరంలో ట్రాఫిక్ రూల్స్ వాహనదారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి.దీనికి కారణం కొందరు వాహనాల డ్రైవింగ్ విషయంలో చేస్తున్న తప్పులేనట.

 Hyderabad, Police Shocking, Traffic Rules, Driving License Cancelled If Violates-TeluguStop.com

హెల్మెట్ పెట్టుకోకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతూ, ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి దోహదపడుతున్నారని నగర ట్రాఫిక్ అధికారులు ఇలాంటి వారి విషయంలో రూల్స్ కఠినతరం చేస్తున్నారు.

ఇక నుండి ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి హెచ్చరికలు జారి చేస్తున్నారు.హెల్మెట్ లేకపోతే కేవలం రూ.100 చలానా కడితే సరిపోతుందనే భావనలో ఉండకండి.ఇక నుంచి చలానా కట్టడమే కాదు, హెల్మెట్ లేకుండా బండి నడిపిన వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని స్పష్టం చేస్తున్నారు.

మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

అందుకే హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అంటూ తెలియచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube