ప్రజలకు హెచ్చరిక.. మొక్కుబడి తనిఖీలకు చెల్లు.. ఇక సీరియస్ యాక్షన్ అంటా.. ?

గతేడాది దేశంలోకి ప్రవేశించిన కరోనా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నదని వైద్య అధికారులు హెచ్చరిస్తున్న పట్టించుకోని ప్రజలు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం కేసుల తీవ్రత ఊహంచని స్దాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.

 Warning To The People Of Telangana Government Issued By-TeluguStop.com

ఈ క్రమంలో గత సంవత్సరం నుండే కరోనా నిబంధనలు అమలులోకి తెచ్చారు.

కానీ వీటిని పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చూసీ చూడనట్లుగా వ్యవహరించింది.ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు సెకండ్ వేవ్ ముప్పునకు కారణమైందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పేర్కొంటున్నారు.

 Warning To The People Of Telangana Government Issued By-ప్రజలకు హెచ్చరిక.. మొక్కుబడి తనిఖీలకు చెల్లు.. ఇక సీరియస్ యాక్షన్ అంటా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కు పెట్టుకోవడం, కోవిడ్ నియమాలను తప్పని సరిగ్గా పాటించడం వంటివి నిర్బంధ క్రమశిక్షణగానే అమలుచేయాలని వెల్లడించారట.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి మాస్కులు పెట్టుకోనివారిపై కేసుల నమోదలు మొదలు స్పాట్ ఫైన్ వసూళ్ల వరకు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉందని ఈ నిర్ణయాల వల్ల తెలుస్తుంది.

ఒకరకంగా ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయమార్గంగా మారుతుందని అనుకుంటున్నారట.

మొత్తానికి ఇకనుండి మొక్కుబడి తనిఖీలకు కాలం చెల్లిస్తూ, ఇక సీరియస్ యాక్షన్ అంటూ అధికారులు రంగంలోకి దిగుతున్నారని అర్ధం అవుతుంది.

#People #Issued By Jivo #Warning

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు