రేవంత్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేల వార్నింగ్.. భ‌య‌మా.. ముందు జాగ్ర‌త్తా?

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడిగా ఇలా ఎన్నిక‌య్యారో లేదో అలా యాక్ష‌న్ డైలుగులు పేల్చారు.కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టాల‌ని, వారిపై తాము సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడుతామ‌ని చెప్పారు.

 Warning Of Defecting Mlas To Rewanth Fear Precaution, Revanth, Trs, Telangana Co-TeluguStop.com

అయితే మొద‌టి నుంచి వీరిపై కాస్త మౌనంగానే రేవంత్ ఒక్క‌సారిగా రెచ్చిపోవ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా నింపేందుకా లేక త‌న మార్కును చూపించుకునేందుకా అనేది అటుంచితే ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్య‌ల‌పై ఈరోజు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు.ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డితో పాటు గండ్ర వెంకటరమణరెడ్డి క‌లిసి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై నిప్పులు చెరిగారు.

రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాల‌ని, త‌మ‌ను నిందిస్తే స‌రైన బుద్ధి చెప్తామ‌ని హెచ్చ‌రించారు.ఇక రేవంత్ చేసిన రాళ్ల‌తో కొట్టాల‌నే వ్యాఖ్య‌ల‌కు స‌రైన స‌మాధానం ఇచ్చారు.త‌మ‌ను రాళ్ల‌తో కొడితే రేవంత్‌ను తాము చెప్పులతో కొడతామంటూ సంచ‌ల‌న వార్నింగ్ ఇచ్చారు.

Telugu @ktrtrs, @revanth_anumula, Gandravenkata, Manikya Thakur, Ts, Revanth-Tel

రేవంత్‌రెడ్డి నీచ రాజ‌కీయాల‌తో మాణిక్కం ఠాగూర్‌కి రూ.25 కోట్లు లంచం ఇచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నాడ‌ని ఆరోపించారు.ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి త‌మ గురించి మాట్లాడ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే రేవంత్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని టీఆర్ ఎస్ నేత‌లు ఈ రోజు ఆయ‌న గురించి మాట్లాడ‌టం, పైగా ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.వీరంతా ముందు జాగ్ర‌త్త కోస‌మే ఇలా మాట్లాడుతున్నారా లేక రేవంత్‌కు కౌంట‌ర్ చెప్ప‌లేద‌ని కేసీఆర్ తిడ‌తార‌నే భ‌య‌మా అనేది చ‌ర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి రేవంత్ ఎఫెక్ట్ టీఆర్ ఎస్‌లో బాగానే త‌గిలిన‌ట్టుంది.మ‌రి వీరి వ్యాఖ్య‌ల‌పై రేవంత్ ఏమైనా స్పందిస్తారా లేక మౌనంగా ఉంటారా అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube