ఆర్చర్‌ కు సవాలు విసిరిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.

కరోనా కారణంగా ఎన్ని రోజులు బ్రేక్ పడిన ఐపిఎల్ ఎట్టకేలకు స్టార్ అయ్యింది.ఇక ఈ విషయంపై రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలను చేపడుతున్న వార్నర్ ను ఈ నెల 21వ తేదీన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆడనున్న తొలి మ్యాచ్ గురించి అడగగా ఆయన ఈ మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు.

 Warner Challenges Jofra Archer, Ipl, Jofra Archer, David Warner, England, Sun Ri-TeluguStop.com

అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.అతని బౌలింగ్‌లో నేను ఐదు సార్లు ఔటయ్యాను.

కానీ ఈసారి ఐపిఎల్ లో తనను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.ఆర్చర్‌ రెడీగా ఉండు మన లెక్కలు తేల్చుకుందాం’ అని అన్నాడు.

ఇక ఈనెల 21వ తేదీన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడనున్నది.ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్ డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్‌సన్‌, బెయిర్‌ స్టో, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌ వంటి విదేశీ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తున్న స్వదేశీ ఆటగాళ్ల లేమి కారణంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ గత సీజన్లో కూడా ఇబ్బందులు పడింది.

మరి ఈ సీజన్ లో సన్‌రైజర్స్‌ ఆ లోటును అదిగమిస్తుందో లేదో వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube