ఈ స్నానంతో ఒత్తిడి,అలసట ఉఫ్....

రోజంతా అలసిపోతే వేడి నీటి స్నానము చేయాలనీ అనిపిస్తుంది.వేడి నీటి స్నానం చేయగానే బడలిక,అలసట అన్ని ఎగిరిపోతాయి.

 Warm Water Reduces Stress-TeluguStop.com

ఇప్పుడు అలసటను దూరం చేసే వేడి నీటి స్నానము గురించి తెలుసుకుందాం.

కావలసిన వస్తువులు

ఎప్సమ్ సాల్ట్ – ముప్పావు కప్పు

వంటసోడా – అరకప్పు

కార్న్ స్టార్చ్ – ముప్పావు కప్పు

ఆముదం – మూడు స్పూన్స్

సిట్రిక్ యాసిడ్ – ముప్పావు కప్పు

లావెండర్ నూనె – రెండు స్పూన్స్

ఫుడ్ కలర్ – ఒక స్పూన్

నీళ్లు – ఒక స్పూన్

కోడిగుడ్డు బాక్స్ – ఒకటి

తయారీ విధానం

ఒక బౌల్ లో ఎప్సమ్ సాల్ట్,వంటసోడా, కార్న్ స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ తీసుకోవాలి.

మరొక బౌల్ లో లావెండర్ నూనె,ఆముదం,ఫుడ్ కలర్,నీళ్లు తీసుకోవాలి.కొంచెం సేపు అయ్యాక ఈ రెండింటిని కలిపి స్పూన్ తో కలపాలి.

ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డు బాక్స్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.ఏడు గంటల తర్వాత స్నానానికి ఉపయోగించవచ్చు.

లాభాలు

వీటితో స్నానం చేయటం వలన ఒత్తిడి,అలసట వెంటనే దూరం అవుతాయి.అంతేకాక దీనిలో సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది.

ఆముదం చర్మానికి కాంతినిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube