అమెరికాలో దారుణం..తెలుగు విధ్యార్ధి హత్య       2018-07-08   01:13:05  IST  Bhanu C

అమెరికాలో రోజు రోజు కి భారత ఎన్నారైలపై దాడులు పెట్రేగి పోతున్నాయి..తమ ఉనికి కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు అమెరికన్స్ భారతీయులపై దాడులు చేస్తూనే ఉన్నారు..గతంలో జాత్యహంకార దాడులు జరిగిన నేపధ్యంలో భారతీయులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు అయితే ఎదో ఒక మూలన ఘోరం జరిగిపోతోంది కూడా..ఆసలు వివరాలలోకి వెళ్తే…

తెలుగు ఎన్నారై విద్యార్ధిని టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో వరంగల్ కి చెందిన శరత్ ప్రాణాలు విడిచాడు..అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని కలలు కన్న తెలుగు విద్యార్ధి కొప్పుల శరత్ మృతి చెందాడు దుండగుల కాల్పుల్లో మిస్సోరిలోని ఓ రెస్టారెంట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శరత్‌పై దుండగులు కాల్పులు జరిపారు.

వెంటనే శరత్‌ స్నేహితులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రాణం దక్కలేదు. వరంగల్‌కు చెందిన శరత్‌.. మిస్సోరి యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. కాల్పులు జరిగిన సమాచారాన్ని తన స్నేహితుల ద్వారా శరత్ తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు..అయితే ఈ హత్య జాత్యహంకార దాడుల లేక మరేదన్నా కారణమా వనే విషయంపై ప్రయత్నం చేశారు.