దిల్ రాజు ను ఢీ కొట్టేందుకు 'వరంగల్ శ్రీను' పుష్పతో టార్గెట్‌- Warangal Srinu Take Allu Arjun Pushpa Movie Rights

warangal srinu take allu arjun pushpa movie rights , warangal srinu , pushpa movie, allu arjun, nizam rights - Telugu Allu Arjun, Breaking News, Dil Raju, Film News, Krack Movie News, Nizam Rights, Pushpa Movie, Warangal Srinu, Warangal Srinu Take Allu Arjun Pushpa Movie Rights

ఈమద్య కాలంలో నైజాం డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.క్రాక్‌ సినిమా ప్రెస్ మీట్‌ సమయంలో ఈయన దిల్‌ రాజుపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 Warangal Srinu Take Allu Arjun Pushpa Movie Rights-TeluguStop.com

దిల్‌ రాజు కు ఇండస్ట్రీలో అసలు ఎదురు లేదు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా వరంగల్ శ్రీను మాత్రం ఆయనకు ఎదురు తిరిగారు.పెద్ద సినిమాలు మరియు ప్రముఖ హీరోల సినిమాలు అన్ని కూడా ఈమద్య కాలంలో ఎక్కువగా దిల్ రాజు తీసుకుంటున్నాడు.

ఇలాంటి సమయంలో వరంగల్ శ్రీను ఆయన్ను ఢీ కొట్టేందుకు ముందుకు వచ్చాడు.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాను దిల్ రాజు కొనుగోలు చేయాలనుకున్నాడు.

 Warangal Srinu Take Allu Arjun Pushpa Movie Rights-దిల్ రాజు ను ఢీ కొట్టేందుకు వరంగల్ శ్రీను’ పుష్పతో టార్గెట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అనూహ్యంగా దిల్ రాజు కంటే ఎక్కువ మొత్తంను మైత్రి వారికి ఇచ్చేందుకు ముందుకు వచ్చి నైజాం రైట్స్ ను దక్కించుకున్నాడు.

కేవలం మైత్రి వారు నిర్మిస్తున్న పుష్ప సినిమా మాత్రమే కాకుండా త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న సర్కారు వారి పాట సినిమా ను కూడా వరంగల్ శ్రీను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకోసం భారీ మొత్తంను ఆఫర్‌ చేస్తున్నాడు.ఈ సినిమాలను విడుదల చేసేందుకు దిల్ రాజు థియేటర్లు ఎలా ఇవ్వడో నేను చూస్తాను అంటూ శీను ఛాలెంజ్ చేస్తున్నాడు.

ఈ సమయంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా ఈయన నిర్మాత గా మరియు తెలుగు రాష్ట్రాల హోల్‌ సేల్ డిస్ట్రిబ్యూటర్‌ గా కూడా మారుతున్నాడు.మొత్తానికి ఈ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

దిల్‌ రాజు ను ఢీ కొట్టేందుకు వరంగల్ శ్రీను చాలా నే ఖర్చు పెడుతున్నాడు.ఆ విషయంలో ఆయన్ను కొందరు సమర్థిస్తున్నారు.

ఆయనకు ఆర్థికంగా వెనుక ఉన్నారు అంటున్నారు.

#Allu Arjun #WarangalSrinu #Nizam Rights #Dil Raju #Warangal Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు